తెలుగు న్యూస్ / ఫోటో /
Mahalakshmi Scheme : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మార్గదర్శకాలివే!
- Mahalakshmi Scheme : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
- Mahalakshmi Scheme : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
(1 / 11)
తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా శనివారం అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
(3 / 11)
శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
(6 / 11)
పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.
(7 / 11)
స్థానికత ధ్రవీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి. కిలోమీటర్ల ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితుల్లేవు.
(8 / 11)
ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేస్తారు.అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.
(9 / 11)
మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖా
ఇతర గ్యాలరీలు