(1 / 6)
ఇటీవల వరదలకు ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతం అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన వారికి సాయం అందించేందుకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరు ముందుకొచ్చారు. తమ సామర్థ్యం మేరకు ఆర్థిక సాయం అందించారు.
(2 / 6)
ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి శనివారం కలిశారు. ఏపీలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, తన తనయుడు హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు.
(3 / 6)
సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి...వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. విరాళం చెక్కులు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవికి ఆయన సాదర స్వాగతం పలికారు. అనంతరం కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు.
(4 / 6)
సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి
(5 / 6)
వరద సాయం కింద ఏపీ సీఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందజేసిన ప్రముఖ హీరో చిరంజీవి
(6 / 6)
సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి
ఇతర గ్యాలరీలు