AP TG Weather Updates : ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు! ఈ జిల్లాలకు IMD ఎల్లో హెచ్చరికలు
- AP Telangana Rains : ఇవాళ, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఏపీలో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. దిగివ ట్రోపోస్పిరిక్ పశ్చిమ , వాయువ్య గాలులు ఆంధ్రప్రదేష్ యానాం మీదుగా వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
(2 / 6)
తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(3 / 6)
ఇవాళ(సెప్టెంబర్ 2) వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(4 / 6)
భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 6)
రేపు(సెప్టెంబర్ 3) వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 6)
సెప్టెంబర్ 4 నుంచి తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక ఏపీలోని మన్యం, అల్లూరి,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, ప్రకాశం,కర్నూలు,నంద్యాల,శ్రీ సత్యసాయి,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు