తెలుగు న్యూస్ / ఫోటో /
NDA Meeting : దిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం- చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరు
- NDA Meeting : దిల్లీలో ఎన్డీఏ భాగస్వాముల సమావేశం జరిగింది. దిల్లీలో ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానించారు.
- NDA Meeting : దిల్లీలో ఎన్డీఏ భాగస్వాముల సమావేశం జరిగింది. దిల్లీలో ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానించారు.
(1 / 6)
దిల్లీలో ఎన్డీఏ భాగస్వాముల సమావేశం జరిగింది. దిల్లీలో ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానించారు.
(2 / 6)
దిల్లీలో ప్రధాని నివాసంలో జరిగిన ఎన్డీఏ భాగస్వాముల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్, ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యారు.
(3 / 6)
పదేళ్ల మోదీ సారథ్యంలో ప్రజాసంక్షేమ విధానాలతో 140 కోట్ల మంది దేశ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తీర్మానంలో నేతలు పేర్కొన్నారు
(4 / 6)
ఎల్లుండి(జూన్ 7న) మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం జరగనుంది. ఈ నెల 7న మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిల్లీ వెళ్లనున్నారు. 7న బీజేఎల్పీ సమావేశం తర్వాత ఎన్డీఏ పార్టీలు సమావేశం కానున్నాయి. ఈ నెల 7 రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని ఎన్డీఏ నేతలు కోరనున్నారు. ఈ నెల 9న ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇతర గ్యాలరీలు