తెలుగు న్యూస్ / ఫోటో /
Apple WWDC 2023 event: త్వరలో యాపిల్ మెగా ఈవెంట్: ఏం లాంచ్ కావొచ్చంటే..!
Apple WWDC 2023 event: యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) ఈవెంట్ మరో నెల దూరంలో ఉంది. జూన్ 5వ తేదీన ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్లో లాంచ్‌లు, ప్రకటనలు చేయనుంది యాపిల్ సంస్థ. వివరాలివే.
(1 / 5)
iOS 17: డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఈవెంట్లో తదుపరి ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 17ను యాపిల్ ప్రకటించనుంది. ఈ అప్డేటెడ్ ఓఎస్ ద్వారా ఐఫోన్లను చాలా కొత్త ఫీచర్లు రానున్నాయి. ఈ ఐఓఎస్ 17 టైమ్లైట్ను, రోల్అవుట్ వివరాలను ఈ జూన్ 5న ప్రారంభమయ్యే ఈవెంట్లో యాపిల్ వెల్లడించనుంది.(Pexels)
(2 / 5)
15-inch MacBook Air: 15 ఇంచుల మ్యాక్‌బుక్ ఎయిర్‌ను ఈ ఈవెంట్లో యాపిల్ లాంచ్ చేస్తుందని బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ అంచనా వేశారు. ఎం2 చిప్‌సెట్‌ను, 15.5 ఇంచుల డిస్ప్లేను ఈ మ్యాక్‌బుక్ కలిగి ఉంటుంది. (HT Tech)
(3 / 5)
Mixed Reality Headset: WWDC 2023 ఈవెంట్లో మిక్స్డ్ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ను యాపిల్ ప్రపంచానికి పరిచయం చేస్తుందని అంచనాలు ఉన్నాయి. డ్యుయల్ 4కే మైక్రో OLED డిస్ప్లేలను ఈ VR హెడ్సెట్ కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి.(AFP)
(4 / 5)
watchOS 10: యాపిల్ వాచ్లకు కూడా ఓఎస్ అప్డేట్ను యాపిల్ ప్రకటించే అవకాశం ఉంది. వాచ్ఓఎస్10ను WWDC ఈవెంట్లో యాపిల్ లాంచ్ చేయనుందని అంచనాలు ఉన్నాయి. దీంతో యాపిల్ వాచ్లకు సరికొత్త విడ్జెట్ సిస్టమ్ సహా మరిన్ని కొత్త ఫీచర్లు వస్తాయని తెలుస్తోంది.(HT Tech)
ఇతర గ్యాలరీలు