AP SSC Supplementary Exams 2024 : విద్యార్థులకు అలర్ట్... మే 24 నుంచి ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు, వివరాలివే
- AP SSC Supplementary Exam Date 2024 : ఏపీ టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అప్డేట్ ఇచ్చింది ఏపీ SSC బోర్డు. మే 24వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు(AP SSC Supplementary) ఉంటాయని తెలిపింది. సోమవారం(ఏప్రిల్ 22) ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.
- AP SSC Supplementary Exam Date 2024 : ఏపీ టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అప్డేట్ ఇచ్చింది ఏపీ SSC బోర్డు. మే 24వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు(AP SSC Supplementary) ఉంటాయని తెలిపింది. సోమవారం(ఏప్రిల్ 22) ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.
(1 / 6)
ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.(Photo Source From unsplash.com/)
(2 / 6)
https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result-2024 లింక్ తో విద్యార్థులు సింపుల్ గా ఏపీ పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.(Photo Source From unsplash.com/)
(3 / 6)
ఈ ఏడాది పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో 86.69 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఇందులో బాలురు 84.32, బాలికలు 89.17 ఉత్తీర్ణులు అయ్యారని వివరించారు. 2803 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని ప్రకటించారు. (Photo Source From unsplash.com/)
(4 / 6)
17 స్కూల్స్ లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఫలితాల్లో కర్నూల్ జిల్లా 62.47శాతంతో చివరి స్థానంలో నిలిచింది. టాప్ ప్లేస్ లో పార్వతీపురం మన్యం జిల్లా నిలిచింది.(Photo Source From unsplash.com/)
(5 / 6)
మే 24వ తేదీ నుంచి ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అవుతాయని అధికారులు ప్రకటించారు. జూన్ 3 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. రీవాల్యూయేషన్, రీవెరిఫికేషన్ కోసం రేపట్నుంచే (ఏప్రిల్ 23) దరఖాస్తులను స్వీకరించనున్నారు.(Photo Source From unsplash.com/)
(6 / 6)
సప్లిమెంటరీ పరీక్షల ఫీజుతో పాటు రీవాల్యూయేషన్, రీవెరిఫికేషన్ కోరే విద్యార్థులు ఏప్రిల్ 23వ తేదీ నుంచే ఫీజులు చెల్లించుకోవచ్చని అధికారులు సూచించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ గడువు ముగుస్తుందని వివరించారు. ఆలస్య రుసుముతో మే 23వ తేదీ వరకు ఫీజును చెల్లించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. 4 రోజుల్లో షార్ట్ మెమోలను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇతర గ్యాలరీలు