(1 / 6)
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 15 ఆదివారం సాధారణ సెలవు, 16వ తేదీ సోమవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
(Twitter)(2 / 6)
ఏపీలో భారీ వర్షాలతో సెప్టెంబర్ నెలలో స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికే చాలా సెలవులు వచ్చాయి. వర్షాలతో సెలవులు ఇచ్చిన కారణంగా సెప్టెంబర్ 14 రెండో శనివారం నాడు తరగతులు నిర్వహించారు.
(Image Source Unshplash.com)(3 / 6)
సెప్టెంబర్ లో ఇంకా ఉన్న సెలవుల వివరాలు చూస్తే... 22వ తేదీన ఆదివారం సెలవు, సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 29న ఆదివారం.
(4 / 6)
సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. ఆ రోజే మిలాద్ ఉన్ నబీ, గణేష్ నిమజ్జనంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నెలవంక దర్శనాన్ని బట్టి మిలాద్ ఉన్ నబీ పండుగను 16న కాకుండా.. 17న జరుపుకోనున్నారు. దీంతో 16వ తేదీన సెలవును రద్దు చేశారు. 17వ తేదీన ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
(5 / 6)
సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు, కళశాలలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సెప్టెంబర్ 17న సెలవు ఇస్తుండటంతో నవంబర్ 9వ తేదీ రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించింది.
(6 / 6)
ఇదీలా ఉంటే సెప్టెంబర్14 నుంచి 18 వరకు దేశవ్యాప్తంగా అనేక బ్యాంకులకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవు రానున్నాయి. ఐదు రోజుల్లో కొన్ని ప్రాంతీయ, జాతీయ, వారాంతపు సెలవులు ఉన్నాయి. సెలవుల షెడ్యూల్ కోసం మీ స్థానిక బ్యాంకు బ్యాంచ్ లేదా యాప్ నోటిఫికేషన్లను చెక్ చేయాల్సి ఉంటుంది.
ఇతర గ్యాలరీలు