తెలుగు న్యూస్ / ఫోటో /
Bhogapuram Airport: 2026 జూన్‌కల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తి చేయాలన్న ఏపీ సిఎం చంద్రబాబు
- Bhogapuram Airport: గడువు కంటే ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు జిఎంఆర్ ప్రతినిధుల్ని కోరారు. 2026 జూన్ కంటే ముందే విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామన్నారు. వైసీపీ పిల్ల చేష్టలతో నిర్మాణాన్ని ఆలస్యం చేశారన్నారు.
- Bhogapuram Airport: గడువు కంటే ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు జిఎంఆర్ ప్రతినిధుల్ని కోరారు. 2026 జూన్ కంటే ముందే విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామన్నారు. వైసీపీ పిల్ల చేష్టలతో నిర్మాణాన్ని ఆలస్యం చేశారన్నారు.
(1 / 6)
ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం భోగాపురం విమానాశ్రయ నిర్మాణంతో మారిపోతుందని సిఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ లో పెద్దఎత్తున అభివృద్ధి చెందబోయే నగరంగా అవతరలిస్తుందని, ఎయిర్‌పోర్టుతో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతాయన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు దూరంలో ఉంటుందన్నారు. ఫేజ్-1లో భోగాపురం వరకు బీచ్ రోడ్డు, ఫేజ్-2లో ఇంకో 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్-3లో మూలపేట పోర్టు వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు.
(2 / 6)
వైసీపీ పిల్ల చేష్టలతో భోగాపురం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. రూ.4,700 కోట్లతో ఫేజ్-1 ప్రారంభమైందని, 2015 మే 20న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 7 అక్టోబర్ 2016న కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపిందని బాబు చెప్పారు. అప్పట్లో 2,700 ఎకరాలు కావాలని అనుకున్నామని 2,700 ఎకరాలు అక్వైర్ చేసి 2023 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ప్రభుత్వం మారి మొత్తం టింకర్ చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుతో ఆడుకునే పరిస్థితికి తెచ్చారని, ఇప్పుడు మరలా మొదటికి వచ్చిందన్నారు. లేనిపోని సమస్యలు క్రియేట్ చేశారని శంకుస్థాపన చేసిన దానికి మళ్లీ శంకుస్థాపన చేశారని ఆరోపించారు. వారి పిల్ల చేష్టలు, పిచ్చోళ్ల చేష్టలతో దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితితో నేటివరకు 31.8 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు.
(3 / 6)
భోగాపురం విమానాశ్రయానికి మరో 500ఎకరాలు ఇవ్వడానికి చంద్రబాబు సుముఖత తెలిపారు. ప్రాజెక్టు కట్టేవాళ్లు, డెవలపర్ కూడా ఉత్తరాంధ్ర వాళ్లేనని జిఎంఆర్‌నుద్దేశించి చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరూ కూడా దీన్ని డెవలప్ చేయాల్సి ఉందని ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు 2.8 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందిస్తోందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు 4.5 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించేలా స్టార్ట్ అవుతుందని దీని కెపాసిటీ 45 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో రూ.4,700 కోట్లతో ఫేజ్-1 ప్రారంభిస్తున్నామని 2200 ఎకరాలతో పాటు ఇంకొక 500 ఎకరాలు కూడా ఇవ్వడానికి ఆమోదం తెలుపుతున్నట్టు చెప్పారు.
(4 / 6)
ఎయిర్ పోర్టు పూర్తయితే రాయగఢ్, కోరాపూర్, మల్కన్ గిరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుందని చంద్రబాబు చెప్పారు. రివ్యూలో కొన్ని చిన్న చిన్న సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారని, నేషనల్ హైవే నుంచి 6 కిలోమీటర్ల మేర రోడ్ కనెక్టివిటీ, పాత నేషనల్ హైవేలో 12 చోట్ల కనెక్టివిటీ, జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
(5 / 6)
పోలవరం ప్రాజెక్టును తాను ఎలా సమీక్షిస్తానో, భోగాపురం నిర్మాణాన్ని కూడా రామ్మోహన్ తరచూ సమీక్షించాలని చంద్రబాబు నాయుడు సూచించారుర. దీనిని పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలని విమానాయానశాఖ మంత్రిగా మీ అనుభవం కూడా ఉపయోగపడుతుందన్నారు. అన్ని ఎయిర్‌పోర్టులను చూసినతర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్‌తో ఒక మోస్ట్ మోడరన్ ఎయిర్‌పోర్టు.. విశాఖపట్నం రావడానికి కృషి చేయాలన్నారు.
(6 / 6)
ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారని చంద్రబాబు భోగాపురంలో చెప్పారు. ఓట్ల వర్షం కురిపించారని, ఓట్ల సునామీలో నెంబర్ వన్ ఉత్తరాంధ్రగా ఉందని ఎప్పుడూ కూడా ఓట్లు వేసిన వర్గాలను కానీ, ప్రాంతాలను మర్చిపోవడం సబబు కాదని అందరికీ న్యాయం చేస్తాం కానీ ఉత్తరాంధ్రకు అదనంగా చేయాల్సి ఉందన్నారు. ఆ నమ్మకం కూడా మామీద పెట్టుకున్నారని, అందుకే జిల్లాల పర్యటనలో మొదటగా ఉత్తరాంధ్రకే వచ్చానని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత రాయలసీమకు వెళ్తున్నానని 2026 జూన్ 30న వచ్చి ప్రారంభించేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.
ఇతర గ్యాలరీలు