కోవిడ్ రహిత ప్రాంతాలుగా అండమాన్ నికోబార్ దీవులు-andaman and nicobar islands become covid free again ,national న్యూస్
తెలుగు న్యూస్  /  national  /  కోవిడ్ రహిత ప్రాంతాలుగా అండమాన్ నికోబార్ దీవులు

కోవిడ్ రహిత ప్రాంతాలుగా అండమాన్ నికోబార్ దీవులు

HT Telugu Desk HT Telugu
May 01, 2022 10:50 AM IST

అండమాన్‌ నికోబార్ దీవుల్లో చివరి కోవిడ్19 పేషెంట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడంతో కోవిడ్ రహిత ప్రాంతంగా తాజా హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు.

కోవిడ్ నిర్దారణ పరీక్షలు (ఫైల్ ఫోటో)
కోవిడ్ నిర్దారణ పరీక్షలు (ఫైల్ ఫోటో) (ANI)

అండమాన్ నికోబార్ దీవుల్లో కోవిడ్‌19 కేసులు పూర్తిగా తొలగిపోయాయి.  ఈ ప్రాంతంలో ఉన్న చిట్టచివరి రోగి కూడా డిశ్చార్జి కావడంతో అండమాన్‌ నికోబార్ దీవుల్లో కరోనా వైరస్ ముప్పు తొలగిపోయిందని వైద్య వర్గాలు ప్రకటించారు.  ఏప్రిల్ 23న వైరస్ ప్రభావానికి గురైన వ్యక్తి పూర్తిగా కోలుకుని ఏప్రిల్ 30న డిశ్చార్జి అయినట్లు ప్రకటించారు. 

దీంతో అండమాన్ దీవుల్లో యాక్టివ్‌ కేసులు లేకుండా పోయాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్‌ దీవుల్లో ఇప్పటి వరకు 10,035 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 9,906మంది కోవిడ్‌ బారి నుంచి కోలుకున్నారు. 129మంది ప్రాణాలను కోల్పోయారు.  

దేశంలో 2020 మార్చిలో కోవిడ్ కేసులు వెలుగు చూడటం మొదలయ్యాక  అండమాన్ నికోబార్ దీవుల్లో   7.24లక్షల శాంపుల్స్‌ పరీక్షించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక 3.35లక్షల మందికి వాక్సినేషన్‌ అందించారు. ఆదివారం వెలువడిన హెల్త్  బులెటిన్‌లో అండమాన్ నికోబార్ దీవుల్లో కొత్త కేసులు, యాక్టివ్ కేసులు లేవని ప్రకటించారు. 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్