Sukesh fancy life in Tihar jail: జైలు శిక్ష కాదు అది.. లగ్జరీ హోటల్ వైభోగం..-women who met sukesh chandrashekhar describes his fancy life in tihar jail cops ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Women Who Met Sukesh Chandrashekhar Describes His Fancy Life In Tihar Jail: Cops

Sukesh fancy life in Tihar jail: జైలు శిక్ష కాదు అది.. లగ్జరీ హోటల్ వైభోగం..

HT Telugu Desk HT Telugu
Jan 20, 2023 09:17 PM IST

Sukesh fancy life in Tihar jail: బెదిరింపు వసూళ్ల కేసులో జైళ్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar) జైలు వైభోగం పై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

సుకేశ్ చంద్ర శేఖర్ (ఆరెంజ్ కలర్ స్వెటర్ వేసుకున్న వ్యక్తి)
సుకేశ్ చంద్ర శేఖర్ (ఆరెంజ్ కలర్ స్వెటర్ వేసుకున్న వ్యక్తి)

బెదిరింపు వసూళ్లు సహా పలు క్రిమినల్ కేసుల్లో జైళ్లో ఉన్న సుకేశ్ చంద్ర శేఖర్ (Sukesh Chandrashekhar) కు తిహార్ జైళ్లో సకల వైభోగాలు లభించినట్లు తెలుస్తోంది. 2018 లో తిహార్ జైళ్లో ఉన్న సుకేశ్ ఉన్న సమయంలో జైళ్లో ఆయనను కలిసిన నలుగురు మహిళల వాంగ్మూలాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

ట్రెండింగ్ వార్తలు

Sukesh fancy life in Tihar jail: ఏసీ, ఫ్రిజ్, క్యాష్..

సుకేశ్ (Sukesh Chandrashekhar) ఉన్న తిహార్ జైలు రూమ్ నెంబర్ 1 ఒక లగ్జరీ హోటల్ రూమ్ ను తలపించేదని వారు తెలిపారు. ఫ్రిజ్ లో స్వీట్ బాక్స్ ల్లో క్యాష్ ఉండేదని, ఆ బాక్సులు ఫ్రిజ్ నిండా చెల్లాచెదురుగా పడి ఉండేవని వివరించారు. ఫుడ్ బార్, ఏసీ, ఫ్యాన్, ఐఫోన్, ఇతర యాపిల్ ప్రొడక్ట్స్, ప్లే స్టేషన్, టీవీ,రోలెక్స్ వాచెస్, యాపిల్ బ్లూటూత్ స్పీకర్స్, ల్యాప్ టాప్స్, సోఫా, రిక్లైనర్, ఫోన్లు లెక్కలేనన్ని డిజైనర్ బ్యాగ్స్ రూమ్ లో ఉండేవని తెలిపారు. ఆ సమయంలో జైలు గదిలో జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు కాకుండా, లగ్జరీ హోటెల్ రూమ్ లో వెకేషన్ లో ఉన్నట్లుగా తిహార్ జైళ్లో సుకేశ్ (Sukesh Chandrashekhar) ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. మోడళ్లు, సినీ తారలు మొదలైన వారిని పరిచయం చేసి సుకేశ్ కు సహకరించిన పింకీ ఇరానీతో పాటు మరో ముగ్గురు యువతుల వాంగ్మూలాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. సుకేశ్ (Sukesh Chandrashekhar) తో పాటు పింకీ ఇరానీ నిందితురాలిగా ఉండగా, మిగతా ముగ్గుర సాక్షులుగా వాంగ్మూలం ఇచ్చారు. ఆ ముగ్గురు కూడా సుకేశ్ తిహార్ జైళ్లో ఉన్న సమయంలో పలుమార్లు జైలుకు వెళ్లి అతడిని కలిశారు.

Sukesh fancy life in Tihar jail: జైళ్లో సెక్యూరిటీ చెక్ కూడా లేదు

ఈ ఆరోపణలను సుకేశ్ (Sukesh Chandrashekhar) తరఫు న్యాయవాది ఖండించారు. సుకేశ్ ను దోషిగా తేల్చడం కోసం, ఆయనును చెడ్డవాడిగా చిత్రించడం కోసం ఈ కథనాలను అల్లారని ఆయన ఆరోపించారు. సుకేశ్ (Sukesh Chandrashekhar) పై సుమారు 32 క్రిమినల్ కేసులున్నాయి. 2020-21 మధ్య జైళ్లో ఉన్న పారిశ్రామికవేత్త శివిందర్ మోహన్ కు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి.. ఆయన భార్య ఆదితి సింగ్ నుంచి రూ. 200 కోట్లు తీసుకున్నాడు. జైళ్లో రాజభోగాలను అనుభవించడానికి సంబంధించి నికిత తంబోలి వాంగ్మూలంలో స్పష్టంగా వివరించారు. ‘2018 ఏప్రిల్ లో బీఎండబ్ల్యూ కారులో గేటు నెం 3 నుంచి తిహార్ జైళ్లోకి వెళ్లాం. అక్కడి నుంచి ఇన్నోవాలో లోపలికి తీసుకువెళ్లారు. ఎలాంటి సెక్యూరిటీ చెకింగ్ లు చేయలేదు. మెట్లపై నుంచి లోపలికి వెళ్లాం. సుకేశ్ (Sukesh Chandrashekhar) తో రూమ్ లో మరో యువతి ఉంది. సుకశ్ పెద్ద సినీ ప్రొడ్యూసర్ అని, నాకు సినిమా అవకాశాలు ఇస్తారని పింకీ నాకు చెప్పింది. సుకేశ్ (Sukesh Chandrashekhar) నాకు ఒక డిజైనర్ బ్యాగ్ తో పాటు రూ. 2 లక్షల క్యాష్ గిఫ్ట్ గా ఇచ్చాడు’’ అని నికితా తంబోలి తన వాంగ్మూలం లో వివరించింది.

WhatsApp channel