Crime news : ఆగ్రాలో మహిళపై సామూహిక అత్యాచారం.. తలపై మందు బాటిల్ పగలగొట్టి!
Agra Crime news : ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. నిందితులు.. ఆమెపై దాడి చేశారు. మందు బాటిల్‌ని తలపై కొట్టారు!
Agra Crime news : ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై దాడి చేశారు. మహిళ.. సాయం కోసం ప్రయత్నిస్తూ, ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదీ జరిగింది..
ఉత్తర్ ప్రదేశ్‌లో ఆగ్రాలోని ఓ హోమ్‌స్టే (హోటల్)లో శనివారం రాత్రి జరిగింది ఈ ఘటన. బాధితురాలు.. ఏడాదిన్నర కాలంలో అందులో పనిచేస్తోంది. తాజాగా.. కొందరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె చేత బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడి చేశారు.
ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత.. బాధితురాలు సాయం కోసం ప్రయత్నించింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. సంబంధిత హోమ్‌స్టేకు పరుగులు తీసి.. బాధితురాలని రక్షించారు. చికిత్స, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
Uttar Pradesh crime news : "తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కి.. శనివారం రాత్రి ఫోన్ వచ్చింది. హోమ్‌స్టేలో ఓ మహిళపై కొందరు దాడి చేశారని, ఆమెను రేప్ చేశారని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లాము. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాము," అని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనలో ఇప్పటికి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది.
"నా చేత బలవంతంగా మద్యం తాగించారు. గది లోపలికి ఈడ్చుకెళ్లారు. నేను ప్రతఘటించడంతో నన్ను కొట్టారు. గ్లాస్ బాటిల్ నా తలమీద విసిరారు," అని బాధితురాలు.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పినట్టు సమాచారం.
సాయం కోసం ప్రయత్నం..
Woman gang raped in Agra : కాగా.. బాధితురాలికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మహిళ పడిన బాధ.. వాటిలో స్పష్టంగా తెలుస్తోంది.
"ప్లీజ్. నన్ను కాపాడండి. నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వీళ్లు నన్ను వదలడం లేదు. నా ఫోన్ తీసేసుకున్నారు. అసభ్యకరంగా నన్ను వీడియో తీశారు. అది చూపించి, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నా నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. నన్ను గదిలో బంధించి, చిత్రహింసలు పెట్టారు," అని బాధితురాలు చెబుతుండగా.. ఓ వ్యక్తి, ఆమెను ఈడ్చుకుంటూ తీసుకెళుతున్న దృశ్యాలు.. వీడియోలో చిక్కాయి.
Woman gang raped in Uttar Pradesh : ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీనిచ్చారు.
సంబంధిత కథనం