Man Kills Wife : భోజనం ఆలస్యమైందని.. భార్యను దారుణంగా చంపిన భర్త! చివరికి..-up man kills wife over delay in lunch dies by suicide later ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Up Man Kills Wife Over Delay In Lunch, Dies By Suicide Later

Man Kills Wife : భోజనం ఆలస్యమైందని.. భార్యను దారుణంగా చంపిన భర్త! చివరికి..

Sharath Chitturi HT Telugu
Mar 19, 2024 06:39 AM IST

Man Kills Wife in UP : పొలం పనులు చేసుకు వచ్చిన తనకు సమయానికి భోజనం పెట్టలేదన్న కోపంతో.. ఓ వ్యక్తి, తన భార్యను కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా సూసైడ్​ చేసుకున్నాడు. ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది ఈ ఘటన.

భార్యను చంపిన భర్త.. చివరికి!
భార్యను చంపిన భర్త.. చివరికి!

Man Kills Wife over delay in lunch : ఉత్తర్​ ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం ఆలస్యమైందన్న కారణంతో.. ఓ వ్యక్తి, తన భార్యని చంపేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

ఉత్తర్​ ప్రదేశ్​ సితాపూర్​లోని కోత్వాలన్​పుర అనే గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది ఈ ఘటన. 30ఏళ్ల పరాశ్రమ్​.. పొలం పనుల కోసం వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి వచ్చాడు. భోజనం వడ్డించాలని.. తన 28ఏళ్ల భార్య, ప్రేమ దేవిని అడిగాడు. అప్పటికి భోజనం రెడీ అవ్వలేదు. ఆ విషయం అతనికి చెప్పింది!

అంతే! వారి మధ్య గొడవ మొదలైంది. పరాశ్రమ్​కి కోపం పెరిగిపోయింది. ఓ పదునైన ఆయుధం తీసుకుని భార్యపై దాడి చేశాడు. అనంతరం ఆమెను చంపేశాడు. క్షణికావేశంలో ముందు, వెనుక చూసుకోకుండా.. భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత భయపడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందేమో అని భయపడ్డాడు పరాశ్రమ్​. చివరికి.. ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

Man Kills Wife in UP : ఈ వ్యవహారం స్థానికులకు తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే భార్యాభర్తలు మరణించారని తెలుసుకున్నారు. అనంతరం.. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

డ్యాన్స్​ చేస్తుంటే మ్యూజిక్​ ఆపేశాడని..

దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా.. నేరాలకు పాల్పడుతున్నారు. తాను డ్యాన్స్​ చేస్తుంటే, మ్యూజిక్​ ఆపేశాడన్న కోపంతో.. ఓ వ్యక్తి, తన అన్నను చంపేశాడు! ఈ ఘటన మధ్యప్రదేశ్​లో చోటుచేసుకుంది.

UP man kills wife : మధ్యప్రదేశ్​ మౌహర్​ గ్రామంలో గత శుక్రవారం రాత్రి జరిగింది ఈ ఘటన. బాధితుడి పేరు రాకేశ్​​. అతని వయస్సు 35. నిందితుడు రాజ్​కుమార్​ కోల్​ వయస్సు 30. వాళ్లిద్దరు అన్నదమ్ములు.

కాగా.. శుక్రవారం రాత్రి.. తన ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్​ని ఏర్పాటు చేశాడు రాకేశ్​. ఆ ఫంక్షన్​కి రాజ్​కూమార్​ వెళ్లాడు. అందరితో కలిసి మ్యూజిక్​కి డ్యాన్స్​ చేయడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి.. రాకేశ్​ వచ్చి.. మ్యూజిక్​ సిస్టెమ్​ని ఆపేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం