Black magic : ఘోరం! స్కూల్​ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి..-up crime news class 2 boy sacrificed for schools success director and staff arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Black Magic : ఘోరం! స్కూల్​ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి..

Black magic : ఘోరం! స్కూల్​ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి..

Sharath Chitturi HT Telugu
Sep 27, 2024 01:38 PM IST

UP crime news : యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్​ సక్సెస్​ అవ్వాలన్న కారణంతో కొందరు.. 2వ తరగతి చదువుకుంటున్న బాలుడిని బలి ఇచ్చారు! ఈ కేసులో పోలసులు ఐదుగురిని అరెస్ట్​ చేశారు.

2వ తరగతి విద్యార్థి బలి!
2వ తరగతి విద్యార్థి బలి!

ఉత్తర్​ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. హథ్రస్​లోని ఓ స్కూల్​ హాస్టల్​లో 2వ తరగతి విద్యార్థిని బలి ఇచ్చారు. స్కూల్​ సక్సెస్​ అవ్వాలన్న కారణంగా ఈ విధంగా క్షుద్రపూజలు చేశారు!

ఇదీ జరిగింది..

హథ్రస్​లోని రస్గవన్​లో డీఎల్​ పబ్లిక్​ స్కూల్​లో కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. స్కూల్​ హాస్టల్​లో 2వ తరగతి చదువుతున్న బాలుడిని బలి ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న స్కూల్​ డైరక్టర్​, అతని తండ్రితో పాటు ముగ్గురు టీచర్లను పోలీసులు అరెస్ట్​ చేశారు.

విచారణలో భాగంగా వెలువడిన పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. స్కూల్​ డైరక్టర్​ తండ్రి దినేశ్​ బఘేల్​కి క్షుద్రపూజల మీద నమ్మకం ఉందని తెలిపారు. బాలుడిని తొలుత స్కూల్​ బయట ఉన్న ట్యూబ్​వెల్​ దగ్గర చంపాలని భావించారు. కానీ హాస్టల్​ నుంచి బయటకు తీసుకువెళుతుండగా బాలుడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఫలితంగా అక్కడే, అతడి గొంతు నులిమి చంపేశారు.

స్కూల్​కి సమీపంలో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి.

స్కూల్​ సక్సెస్​ కోసం క్షుద్రపూజలు చేయాలని నిందితులు గతంలో కూడా ప్లాన్​ వేశారు. సెప్టెంబర్​ 6వ 9వ తరగతి స్టూడెంట్​ని బలి ఇవ్వాలని చూశారు. కానీ విఫలం అయ్యారు.

2వ తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి పేరు కిషన్​ కుష్వాహ. తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని ఈ సోమవారం ఆయనకు కాల్​ వచ్చింది. వెళ్లి చూసేసరికి స్కూల్​లో ఆ బాలుడు కనిపించలేదు. స్కూల్​ డైరక్టర్​.. బాలుడిని తన కారులో హాస్పిటల్​కి తీసుకెళ్లారని తెలిసింది. కానీ కారులో ఆ బాలుడి మృతదేహం లభించింది.

ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. క్షుద్రపూజల పేరుతో 2వ తరగతి విద్యార్థిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్​ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి, నిందితులను శిక్షిస్తామని పోలీసులు హామీనిచ్చారు.

భోపాల్​లో 5ఏళ్ల బాలిక..

మధ్యప్రదేశ్​ భోపాల్​లోని బహుళ అంతస్తుల భవనంలోని తాళం వేసి ఉన్న అపార్ట్​మెంట్ వాటర్ ట్యాంక్​లో ఐదేళ్ల బాలిక మృతదేహం గురువారం లభ్యమైంది. రెండు రోజులుగా బాలిక కనిపించకుండా పోవడంతో పదుల సంఖ్యలో పోలీసు అధికారులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. చివరికి మృతదేహాన్ని వెలికితీశారు.

బాలిక మృతదేహం లభ్యం కావడంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్లను దిగ్బంధించి హంతకులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్​ చేశారు. బాలిక మృతదేహాన్ని కనుగొనడానికి పోలీసులకు మూడు రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నిస్తూ షాజహానాబాద్ పోలీస్ స్టేషన్​ను ముట్టడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

మంగళవారం మధ్యాహ్నం తన కుటుంబం నివసిస్తున్న భవనం నుంచి అదృశ్యమైన బాలిక ఆచూకీ కోసం సుమారు 100 మంది పోలీసులతో పాటు డ్రోన్లు, డైవర్లను (సమీప నీటి వనరులు, మురుగు కాల్వల్లో గాలింపు కోసం) రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు.

చివరికి.. తాళం వేసి ఉన్న ఓ ఫ్లాట్​పై ఉన్న వాటర్ ట్యాంకులో ఐదేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. అపార్ట్​మెంట్ నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేసినా తాళం వేసిన ఫ్లాట్​ ను ఎందుకు తెరవలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఫిర్యాదు చేసిన తర్వాత తాళం వేసి ఉన్న ఫ్లాట్​ను తెరవాలని పోలీసులను కోరినా వారు పట్టించుకోలేదని ఆరోపిస్తూ బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు రోడ్డు దిగ్బంధం చేశారు.

తాళం వేసి ఉన్న ఫ్లాట్​ను తెరిచే ముందు వాషింగ్ ఆ ప్రాంతంలోని 1,000 ఫ్లాట్లను పోలీసులు తనిఖీ చేశారు.

బాలిక మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐదేళ్ల బాలిక మృతిలో క్షుద్ర పూజల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత కథనం