Sunita Williams : సునీతా విలియమ్స్​ని 2025 వరకు నాసా ఎందుకు వెనక్కి తీసుకురాలేదు?-sunita williams stuck in space why did nasa schedule her return to earth in 2025 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sunita Williams : సునీతా విలియమ్స్​ని 2025 వరకు నాసా ఎందుకు వెనక్కి తీసుకురాలేదు?

Sunita Williams : సునీతా విలియమ్స్​ని 2025 వరకు నాసా ఎందుకు వెనక్కి తీసుకురాలేదు?

Sharath Chitturi HT Telugu
Aug 25, 2024 01:27 PM IST

Sunita Williams stuck in space : వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లేకుండా బోయింగ్ స్టార్​లైనర్​ క్యాప్సూల్ ఐఎస్ఎస్ నుంచి తిరిగి వస్తుందని నాసా ధృవీకరించింది. 2025 ఫిబ్రవరిలో స్పేస్ఎక్స్​కి చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరిగి వస్తారు.

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ (AFP)

8 రోజుల ట్రిప్​ అని వెళ్లి 60 రోజుల పాటు ఐఎస్​ఎస్​ (ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​)లో చిక్కుకుపోయిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్​, ఆమె సహచరుడు బుచ్​ విల్మోర్​.. ఈ ఏడాది భూమి మీదకి తిరిగి రాలేరు! ఈ విషయాన్ని నాసా (నేషనల్​ ఏరోనాటిక్స్​ అండ్​ అడ్మినిస్ట్రేషన్​) స్వయంగా ప్రకటించింది. ఈ ఇద్దరు వ్యోమగాములు 2025 ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్​ స్పేస్ఎక్స్​ చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా భూమికి తిరిగి వస్తారని నాసా వెల్లడించింది.

yearly horoscope entry point

బోయింగ్​ స్టార్​లైనర్​ ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్​లు జూన్​లో అంతరిక్షంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఫ్లైట్​లో సాంకేతిక లోపాల కారణంగా వారు వెనక్కి తిరిగి రాలేకపోతున్నారు. కాగా వారిద్దరు లేకుండా బోయింగ్ స్టార్​లైనర్​ క్యాప్సూల్ అంతర్జాతీయ స్పేక్ స్టేషన్ నుంచి తిరిగి వస్తుందని నాసా తెలిపింది.

సునీతా విలియమ్స్ రాకను నాసా 2025కు ఎందుకు వాయిదా వేసింది?

ప్రస్తుతం వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్​లను తిరిగి భూమికి తీసుకురావడం చాలా ప్రమాదకరమని నాసా అధికారులు శనివారం తెలిపారు.

"విల్మోర్, విలియమ్స్ 2025 ఫిబ్రవరి వరకు ఎక్స్పెడిషన్ 71/72 సిబ్బందిలో భాగంగా తమ పనిని అధికారికంగా కొనసాగిస్తారు. ఏజెన్సీ స్పేస్​ఎక్స్ క్రూ-9 మిషన్​కు కేటాయించిన మరో ఇద్దరు సిబ్బందితో కలిసి డ్రాగన్ స్పేస్​క్రాఫ్ట్​లో వీరు భూమి మీదకు తిరిగొస్తారు. సెప్టెంబర్ ప్రారంభంలో స్టార్​లైనర్​ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరి సురక్షితమైన, నియంత్రిత స్వయంప్రతిపత్తితో కూడిన రీఎంట్రీ, ల్యాండింగ్ చేసే అవకాశం ఉంది,' అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

స్పేస్​ఎక్స్​ ఎంట్రీ..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను పంపగల ఏకైక అమెరికన్ ప్రైవేట్​ కంపెనీ ఎలన్ మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్. స్పేస్​ఎక్స్ క్యాప్సూల్ ప్రస్తుతం ఐఎస్ఎస్ వద్ద పార్క్ చేసి ఉంది. ఇది మార్చి నుంచి అక్కడ ఉన్న నలుగురి కోసం రిజర్వ్​లో ఉంది. వారు ఈ ఏడాది సెప్టెంబర్​లో భూమి మీదకి తిరిగి రావాల్సి ఉంది. స్పేస్​ఎక్స్ తదుపరి స్పేస్ ఫ్లైట్ ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది.

ఐఎస్ఎస్, రష్యన్ సోయుజ్ క్యాప్సూల్ వద్ద మరో వ్యోమనౌక ఉంది. కానీ రష్యన్ క్యాప్సూల్ మరింత చిన్నగా ఉంటుంది. ఇందులో ముగ్గురు వ్యోమగాములను మాత్రమే పట్టగలరు. ఏడాది పాటు పరిశోధనల అనంతరం ఈ క్యాప్సూల్ ద్వారా ఇద్దరు రష్యన్లను స్వదేశానికి వస్తారు.

తదుపరి స్పేస్​ఎక్స్ టాక్సీ విమానం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి వెళుతుంది. వాస్తవానికి నలుగురిని ఇందులో పంపాలని తొలుత భావించారు. కానీ ఫిబ్రవరి చివరలో తిరిగి వచ్చే విమానంలో విల్మోర్​, సునీతా విలియమ్స్​కు చోటు కల్పించడానికి ఇది ఇప్పుడు ఇద్దరిని మాత్రమే తీసుకువెళుతుంది.

బోయింగ్ స్టార్ లైనర్​లో హీలియం లీక్

ఈ ఏడాది ప్రారంభంలో భూమి నుంచి ప్రయోగించడానికి ముందే బోయింగ్ స్టార్ లైనర్​లో పదేపదే లోపాలు తలెత్తాయి. నాసా, బోయింగ్ సంస్థలు హీలియం లీకేజీలను గుర్తించాయని, స్పేస్ క్రాఫ్ట్ రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్లలో సమస్యలు తలెత్తాయని జూన్ 6న ఫిర్యాదులు వచ్చాయి.

అప్పటి నుంచి, ఇంజనీరింగ్ బృందాలు గణనీయమైన పనిని పూర్తి చేశాయి. వీటిలో డేటా సేకరణను సమీక్షించడం, ఫ్లైట్, గ్రౌండ్ టెస్టింగ్ నిర్వహించడం, ఏజెన్సీ ప్రొపల్షన్ నిపుణులతో స్వతంత్ర సమీక్షలను నిర్వహించడం, వివిధ రిటర్న్ కంటింజెన్సీ ప్రణాళికలను అభివృద్ధి చేయడం ఉన్నాయి. సేఫ్టీ స్టాండర్డ్స్​పై అనుమానాలు ఉండటంతో సునీతా విలియమ్స్, విల్మోర్ ఇందులో తిరిగి రావడం ప్రమాదకరం.

Whats_app_banner

సంబంధిత కథనం