Sunita Williams space mission : చివరి నిమిషంలో.. సునీత విలియమ్స్ 3వ​ స్పేస్​ మిషన్​ రద్దు!-boeing starliners historic mission with sunita williams onboard aborted in last minute ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sunita Williams Space Mission : చివరి నిమిషంలో.. సునీత విలియమ్స్ 3వ​ స్పేస్​ మిషన్​ రద్దు!

Sunita Williams space mission : చివరి నిమిషంలో.. సునీత విలియమ్స్ 3వ​ స్పేస్​ మిషన్​ రద్దు!

Sharath Chitturi HT Telugu
May 07, 2024 07:18 AM IST

Sunita Williams Boeing : భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్​ 3వ స్పేస్​ మిషన్​.. చివరి నిమిషంలో రద్దు అయ్యింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సునీత విలియమ్స్​ స్పేస్​ మిషన్​ రద్దు!
సునీత విలియమ్స్​ స్పేస్​ మిషన్​ రద్దు! (PTI)

Boeing Starliner launch : భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్​ 3వ స్పేస్​ మిషన్​.. చివరి నిమిషంలో రద్దు అయ్యింది. మరో వ్యోమగామితో కలిసి ఆమె ప్రయాణించాల్సిన బోయింగ్​ కంపెనీకి చెందిన స్టార్​లైనర్​ రాకెట్​లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మిషన్​ని నిలిపివేశారు!

బోయింగ్​ స్టార్​లైనర్​కు అడుగడుగునా అడ్డంకులు..

తొలి మానవసహిత స్టార్​లైనర్​​ మిషన్​ని బోయింగ్​ కంపెనీ.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కానీ ఈ మిషన్​కి అడుగడుగునా అడ్డంకులు ఎదరవుతూ వచ్చాయి. ఫలితంగా.. రాకెట్​ లాంచ్​ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక అంతా సిద్ధం అనుకున్న సమయంలో.. సునీత విలియమ్స్​ 3వ స్పేస్​ మిషన్​ రద్దు అయ్యింది. అట్లాస్​ వీ రాకెట్​ పైభాగంలోని వాల్వ్​లో అనుమనాస్పద ప్రవర్తన కారణంగా.. లాంచ్​కి కొన్ని గంటల ముందు కౌంట్​డౌన్​ని నిలిపివేశారు.

ఈ అట్లాస్​ వీ రాకెట్​ని.. బోయింగ్​-లోక్​హీడ్​ మార్టిన్​ జాయింట్​ వెంచర్​ అయిన యునైటెడ్​ లాంచ్​ అలయెన్స్​ రూపొందించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత.. కాప్సూల్​లోని సిబ్బంది.. మేన్యువల్​గా ఆపరేట్​ చేసి, దీని శక్తిసామర్థ్యాలను లెక్కిస్తారు.

Sunita Williams space mission aborted : మరి ఈ లాంచ్​ మళ్లీ ఎప్పుడు ఉంటుంది? అనేది బోయింగ్​ ఇంకా చెప్పలేదు. కానీ బ్యాకప్​ డేట్​లు.. మే 7, మే10, మే11గా ఉన్నాయి.

మానవసహిత రాకెట్​ లాంచ్​ కోసం చాలా సంవత్సరాలుగా బోయింగ్​ తీవ్రంగా కృషి చేస్తూ వచ్చింది. సునీత విలియమ్స్​, బుచ్​ విల్​మోర్​లు ఈ మిషన్​ కోసం ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్పేస్​ స్టేషన్​కి వెళ్లి, తిరిగి వెనక్కి రావడం.. ఈ మిషన్​లో భాగం.

లాంచ్​కి రెడీ అయిన సునీత విలియమ్స్​, బుచ్​లు.. సీట్లల్లో కూర్చుని లిఫ్ట్​ ఆఫ్​కు సిద్ధమయ్యారు. కానీ మిషన్​ని రద్దు చేయాల్సి వచ్చింది.

"ఇవాల్టి లాంచ్​ని నిలిపివేస్తున్నాము. మేము ముందు చెప్పినట్టు.. మా మొదటి ప్రాధాన్యత భద్రత. రెడీగా ఉన్నప్పుడే వెళతాము," అని నాసా చీఫ్​ బిల్​ నెల్సన్​ తెలిపారు.

సేఫ్టీ విషయంలో బోయింగ్​ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇప్పుడు స్టార్​లైనర్​ లాంచ్​ రద్దు అవ్వడం.. కమర్షియల్​ ఏవియేషన్​ విభాగంపై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Sunita Williams Boeing : నాసాపైనా దీని ప్రభావం ఉండొచ్చు! వ్యోమగాములను ఐఎస్​ఎస్​కి తీసుకెళ్లేందుకు రెండో కమర్షియల్​ పార్ట్​నర్​ కోసం చూస్తోంది నాసా. కానీ బోయింగ్​ మిషన్​కు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవూతూనే వచ్చాయి.

2020లో తన స్పేస్​ఎక్స్​ డ్రాగన్​ క్యాప్సూల్​తో వ్యోమగాములను ఐఎస్​ఎస్​కి పంపించారు ఎలాన్​ మస్క్​. ఫలితంగా.. ఈ విషయంపై రష్యా మీద ఆధారపడే అవసరం తగ్గింది. చివరికి.. స్పేస్​ షటిల్​ ప్రోగ్రామ్​ రద్దు అయ్యింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం