Southwest Monsoon 2024: గుడ్ న్యూస్.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!
Southwest Monsoon : దేశ ప్రజలకు ఐఎండీ గుడ్ న్యూస్ ఇచ్చింది! నైరుతి రుతుపవనాలు.. ఇంకొన్ని రోజుల్లో దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులను తాకనున్నాయి. కేరళను ఎప్పుడు తాకుతాయంటే..
Southest Monsoon 2024 : ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు.. నైరుతి రుతుపవనాల విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణశాఖ ఐఎండీ. నైరుతి రుతుపవనాలు.. మే 22కు బదులు.. మే 19నే దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలను తాకుతుందని వెల్లడించింది. ఈ మేరకు.. సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
జూన్ 1న.. కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..!
ఈ ఏడాది జూన్ 1కి అటు ఇటుగా, అంటే ఇంకొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. కేరళను తాకుతాయని, జులై 15 నాటికి దేశవ్యాప్తంగా వర్షాల ప్రభావం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.
జూన్- సెప్టెంబర్ మధ్య వచ్చే వర్షాకాలం.. దేశానికి చాలా ముఖ్యం. గతేడాది.. జూన్ రెండో వారం వరకు.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకలేదు. ఎల్నీనో ఇందుకు కారణం. కానీ ఇప్పుడు.. జూన్ 1 నాటికే, అంటే సాధారణ సమయానికే నైరుతి రుతుపవనాలు.. కేరళను తాకుతాయంటుండటం గుడ్ న్యూస్!
Southest Monsoon in India : కాగా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా ఎక్కువ ఉంటుందని ఐఎండీ, గత నెలలో వెల్లడించింది. ఎల్పీఏ (లాంగ్ పీరియడ్ యావరేజ్)లో 106శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇక.. నైరుతి రుతుపవనాల కదలికలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుందని ఐఎండీ. మే నెల చివరిలో వెలువడే అప్డేట్ చాలా కీలకంగ మారనుంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు ఎలా ఉంటాయో ఓ క్లారిటీ వస్తుంది.
1971-2020 వరకు ఎల్పీఏ 87సెంటీమీటర్లుగా ఉంది. గతేడాది రుతుపవనాల ప్రభావం.. సాధారణం కన్నా తక్కువగా నమోదైంది. ఎల్పీఏలో 94.4శాతమే నమోదు చేసింది.
Southest Monsoon 2024 prediction : మరోవైపు.. రానున్న 5 రోజుల్లో.. మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, మధ్య మహారాష్ట్ర, మారాఠ్వాడాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఆయా ప్రాంతంలో కనిపిస్తున్న అల్పపీడణ ద్రోణి ఇందుకు కారణం అని వివరించింది.
Southest Monsoon start date : ఐఎండీ ప్రకారం.. మే 14న మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయి. రానున్న 7 రోజుల్లో పశ్చిమ్ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, అండామన్-నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడొచ్చు. కానీ.. మే 16 నుంచి వాయువ్య భారతంపై వడగాల్పుల ప్రభావం ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
సంబంధిత కథనం