TS AP Weather Updates : ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఐఎండీ తాజా అప్డేట్స్ ఇవే
- Telangana AP Weather Updates : ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. మరికొన్నిరోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం ఉంది. ఐఎండీ తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana AP Weather Updates : ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. మరికొన్నిరోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం ఉంది. ఐఎండీ తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వర్షాలు కురుస్తుండటంతో భానుడి భగభగలు తగ్గాయి. మరికొన్ని రోజులు ఏపీ, తెలంగాణలో వానలు పడుతాయని ఐఎండీ అంచనా వేసింది.
(photo from https://unsplash.com/)(2 / 6)
శనివారం(మే 11)రోజు ఏపీలోని కాకినాడ(D) ఏలేశ్వరంలో 28.2 మిమీ,తిరుపతి(D) పుత్తూరులో 27.2మిమీ, కాకినాడ ప్రత్తిపాడులో 14మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శనివారం నంద్యాల(D)చాగలమర్రి, విజయనగరం(D) రాజాం,వైయస్ఆర్ (D) సింహాద్రిపురం 41.5°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 41.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది.
(photo from https://unsplash.com/)(3 / 6)
ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
(photo from https://unsplash.com/)(4 / 6)
రాష్ట్రంలోని పలు మరో మూడు నాలుగు రోజులు అయిదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
(5 / 6)
మరోవైపు తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ(మే 12) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(photo from https://unsplash.com/)ఇతర గ్యాలరీలు