SBI SCO Recruitment 2024: ఎస్బీఐ లో మరో రిక్రూట్మెంట్; మొత్తం 1040 పోస్ట్ లు
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో రిక్రూట్మెంట్ కు తెర తీసింది. సంస్థలో మొత్తం 1040 స్పెషలిస్ట్ కేడర్ అధికారుల నియామకానికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ 2024 కు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
SBI SCO Recruitment 2024: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1040 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆగస్ట్ 8 లాస్ట్ డేట్
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 19న ప్రారంభమై ఆగస్టు 8, 2024న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు అవసరమైన విద్యార్హతలు, అనుభం, వయోపరిమితి పోస్ట్ ల వారీగా, వేర్వేరుగా ఉంటాయి. ఈ వివరాలను అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in లో చూడవచ్చు.
ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ 2024 ఖాళీల వివరాలు
- సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్): 2 పోస్టులు
- సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్): 2 పోస్టులు
- ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ): 1 పోస్టు
- ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్): 2 పోస్టులు
- రిలేషన్షిప్ మేనేజర్: 273 పోస్టులు
- వీపీ వెల్త్: 643 పోస్టులు
- రిలేషన్షిప్ మేనేజర్ - టీమ్ లీడ్: 32 పోస్టులు
- రీజినల్ హెడ్: 6 పోస్టులు
- ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్: 30 పోస్టులు
- ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్: 39 పోస్టులు
ఎంపిక విధానం
అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని ఇంటర్వ్యూ కమ్ సీటీసీ చర్చలకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక కోసం మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులు (కటాఫ్ పాయింట్ వద్ద సాధారణ మార్కులు) సాధిస్తే, అటువంటి అభ్యర్థులకు వారి వయస్సును బట్టి ర్యాంకులు ఇస్తారు.
దరఖాస్తు ఫీజు
జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు (నాన్ రిఫండబుల్) రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులకు ఎలాంటి ఫీజు/ ఇన్ఫర్మేషన్ ఛార్జీలు ఉండవు. వెబ్ సైట్ లోని అప్లికేషన్ ఫామ్ తో పాటు అందుబాటులో ఉన్న పేమెంట్ గేట్ వే ద్వారా ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి స్క్రీన్ పై అడిగిన సమాచారాన్ని అందించడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఆన్లైన్ పేమెంట్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఏవైనా ఉంటే అభ్యర్థులు భరించాలి.
ఇతర వివరాలు
అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను (సంక్షిప్త రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, వయస్సు రుజువు, కుల ధృవీకరణ పత్రం, పిడబ్ల్యుబిడి సర్టిఫికేట్ (వర్తిస్తే), విద్యార్హత, అనుభవం మొదలైనవి) అప్లోడ్ చేయాలి, లేనిపక్షంలో వారి దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ను చూడవచ్చు.