Kolkata doctor rape case : కోల్‌కతా వైద్యురాలిని సంజయ్ రాయ్ చంపలేదా? అతడిని ఇరికిస్తున్నారా?
Kolkata doctor rape case Sanjay roy : కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు నిందితుడు సంజయ్ రాయ్ న్యాయవాది పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆ హత్యను అతను చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వైద్యురాలి హత్య, అత్యాచారం కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ గురించి కొత్త విషయాలు బయటకి వస్తూనే ఉన్నాయి. తాను నిర్దోషినని, తనను ఇరికించారని అతను తన న్యాయవాది కవితా సర్కార్‌కి చెప్పినట్టు తెలుస్తోంది.
కోల్‌కతా వైద్యురాలి హత్య జరిగిన మరుసటి రోజు, ఆగస్టు 10న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. ఘటన జరిగిన సెమినార్ హాల్ లోపల అతని బ్లూటూత్ హెడ్సెట్ కూడా లభ్యమైంది.
పాలీగ్రాఫ్ పరీక్ష సమయంలోనూ తాను నిర్దోషి అన్న స్డాండ్నే మెయిన్టైన్ చేశాడని అతని తరఫు న్యాయవాది తెలిపారు. మహిళను హత్య చేసిన తర్వాత ఏం చేశావు? అన్న ప్రశ్నతో సహా సంజయ్ రాయ్‌ను సీబీఐ 10 ప్రశ్నలు అడిగింది. తాను ఆమెను హత్య చేయనందున ఆ ప్రశ్న చెల్లదని ఆయన సీబీఐ అధికారులకు చెప్పారని పలు మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ఆ నివేదికలో పేర్కొన్న వాదనలను హెచ్‌టీ తెలుగు స్వతంత్రంగా ధృవీకరించలేదు.
ఆసుపత్రిలోని సెమినార్ హాల్లోకి ప్రవేశించే సమయంలో వైద్యురాలు అపస్మారక స్థితిలో ఉందని పాలీగ్రాఫ్ పరీక్షలో రాయ్ పేర్కొన్నాడు. ఆగస్టు 9న సెమినార్ హాల్లో రక్తపు మడుగులో ఉన్న మహిళను చూశానని చెప్పాడు. భయాందోళనకు గురై గది నుంచి బయటకు పరుగెత్తాడు.
ఇదీ చూడండి:- Kolkata doctor rape : సంజయ్ రాయ్‌పై లై డిటెక్టర్ పరీక్ష- అసలు నిజం బయటపడిందా? నిందితుడు ఏం చెప్పాడంటే..
వైద్యురాలు ఎవరో తనకు తెలియదని, తనను ఇరికించారని సంజయ్ రాయ్ చెప్పుకొచ్చాడు.
మరి కోల్‌కతా వైద్యురాలి మృతదేహాన్ని చూసిన తర్వాత పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించగా, తనను ఎవరూ నమ్మరేమోనని భయపడినట్టు రాయ్ చెప్పాడు.
నేరస్థుడు మరొకరు అయ్యుండొచ్చని సంజయ్ రాయ్ తరఫు న్యాయవాది కవిత సర్కార్ అభిప్రాయపడ్డారు.
సెమినార్ హాల్లోకి సంజయ్ రాయ్ అంత సులభంగా ప్రవేశించి ఉంటే, ఆ రాత్రి భద్రతా లోపం కచ్చితంగా ఉందని, దానిని మరెవరైనా సద్వినియోగం చేసుకుని ఉంటారని ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు.
ట్రైనీ డాక్టర్‌పై ఆసుపత్రిలోని సెమినార్ హాల్లోనే అత్యాచారం, హత్య జరిగింది. 36 గంటల షిఫ్ట్‌లో ఆమె హాల్లో నిద్రపోయింది. శవపరీక్షలో ఆమె శరీరంపై లైంగిక దాడి, 25 బాహ్య, అంతర్గత గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
'ఎగ్ నూడుల్స్ కావాలి..'
నిందితుడు సంజయ్ రాయ్ జైలులో వడ్డించిన భోజనంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌లో ఉన్న సంజయ్ రాయ్.. అక్కడ అందించే ప్రామాణిక 'సబ్జీ-రోటీ' (చపాతీ- కూర) భోజనానికి బదులు ఎగ్చౌమీన్ను అందించాలని డిమాండ్ చేశాడని సమచారం. తనకు సబ్జీ-రోటీ వడ్డించినప్పుడు సంజయ్ రాయ్ కోపంగా ఉన్నాడని, అయితే జైలు సిబ్బంది మందలించడంతో చివరకు భోజనం తిన్నాడని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ వర్గాలు తెలిపాయి. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలందరికీ ఒకే రకమైన ఆహారం అందాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం