Doctors safety : ‘నైట్​ షిఫ్ట్స్​ అంటే భయం’- డాక్టర్ల భద్రతపై సర్వేలో షాకింగ్​ వాస్తవాలు!-1 in 3 indian doctors feel unsafe during night shifts an ima study ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Doctors Safety : ‘నైట్​ షిఫ్ట్స్​ అంటే భయం’- డాక్టర్ల భద్రతపై సర్వేలో షాకింగ్​ వాస్తవాలు!

Doctors safety : ‘నైట్​ షిఫ్ట్స్​ అంటే భయం’- డాక్టర్ల భద్రతపై సర్వేలో షాకింగ్​ వాస్తవాలు!

Sharath Chitturi HT Telugu
Aug 30, 2024 01:36 PM IST

Doctors safety in India : నైట్​షిఫ్ట్స్​లో భద్రత కరువైందని మూడింట ఒక వంతు మంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. చాలా మందికి డ్యూటీ రూమ్​ కూడా దొరకక, మరింత ఆందోళన పడుతున్నారు. భద్రత కోసం సొంతంగా ఆయుధాలు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఓ ఐఎంఏ సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి.

కోల్​కతా వైద్యురాలి హత్యపై డాక్టర్ల నిరసనలు..
కోల్​కతా వైద్యురాలి హత్యపై డాక్టర్ల నిరసనలు.. (HT_PRINT)

కోల్​కతా వైద్యురాలి రేప్​, హత్య నేపథ్యంలో ఐఎంఏ (ఇండియన్​ మెడికల్​అసోసియేషన్​) నిర్వహించిన అధ్యయనం, సర్వేలో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. నేట్​ షిఫ్ట్స్​లో భద్రత కరువైందని ప్రతి మూడింట ఒక డాక్టర్​ అభిప్రాయపడ్డారు. వీరిలో మహిళలే అధికంగా ఉన్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, సొంత భద్రత కోసం ఆయుధాలు తీసుకెళ్లాల్సి వస్తుందేమో అని సర్వేలో పాల్గొన్న చాలా మంది వెల్లడించారు.

ఐఎంఏ సర్వేలో కీలక విషయాలు..

దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని 3,885 మందిపై ఈ సర్వే జరిగింది. ఇందులో పాల్గొన్న వారిలో చాలా మంది మహిళలే ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 85శాతం మంది 35ఏళ్ల వయస్సులోపు ఉన్నారు. 61శాతం మంది ఇంటర్న్స్​ లేదా పీజీ ట్రైనీలు. మొత్తం మీద 63శాతం మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఐఎంఏ కేరళ ఛైర్మన్​ డా. రంజీవ్​ జయదేవన్​, ఆయన టీమ్​ ఈ సర్వేని కంపైల్​ చేసింది. ఐఎంఏ కేరళ మెడికల్​ జర్నల్​ అక్టోబర్​ 2024 అడిషన్​లో ఇది పబ్లీష్​ కానుంది.

"24.1శాతం మంది సేఫ్టీ లేదని అభిప్రాయపడ్డారు. 11.4శాతం మంది సేఫ్టీ విషయంపై అత్యంత ఆందోళన వ్యక్తం చేశారు. అంటే మూడింట ఒక వంతు మంది ఇలా అన్నారు. సేఫ్​గా లేమని ఫీల్​ అవుతున్న వారిలో మహిళలే అధికం," అని సర్వే పేర్కొంది.

సేఫ్​గా లేమని ఇంటర్న్​లు, పోస్ట్​గ్రాడ్జ్యుయేట్​ చేస్తున్న 20-30 ఏళ్ల మధ్య డాక్టర్లే అధికంగా భయపడుతున్నారు. నైట్​ షిఫ్ట్స్​లో డ్యూటీ రూమ్​ అందుబాటులో లేదని 45శాతం మంది తెలిపారు. డ్యూటీ రూమ్​కి యాక్సెస్​ లభిస్తున్న వారు మాత్రం, తమ భద్రతపై సానుకూలంగానే ఉన్నారు.

హాస్పిటల్స్​లో రద్దీ కారణంగా డ్యూటీ రూమ్స్​ దొరకడం లేదని, ఫలితంగా వైద్యులు ప్రత్యామ్నాయాలు వెత్తుకోవాల్సి వస్తోందని సర్వేలో తేలింది. మూండిట ఒక వంతు డ్యూటీ రూమ్స్​కి అటాచ్​డ్​ బాత్​రూమ్​లు లేవని స్పష్టమైంది. అంటే, వారు అర్థరాత్రిళ్లు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. వార్డులకు డ్యూటీ రూమ్​లు చాలా దూరంగా ఉంటున్నాయని 53శాతం మంది తెలిపారు.

భద్రత కోసం చాలా మంది సొంతంగా ఆయుధాలు తీసుకువెళ్లాలని భావిస్తున్నట్టు తెలిపారు. తాను ఫోల్డెబుల్​ కత్తిని, పెప్పర్​ స్ప్రేని తనతో పాటు తీసుకెళతానని ఓ డాక్టర్​ తెలిపారు.

మద్యం సేవించిన, డ్రగ్స్​ మత్తులో ఉన్న వారి నుంచి భౌతిక దాడులు ఎదుర్కొంటున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. రద్దీ కారణంగా ఎమర్జెన్సీ రూమ్​లో తనని అసభ్యకరంగా ముట్టుకున్నట్టు మరో డాక్టర్​ తెలిపారు.

సిబ్బంది తక్కువగా ఉండి, సరైన సెక్యూరిటీ లేని చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళా డాక్టర్లు నైట్​షిఫ్ట్స్​లో తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సర్వే తేల్చిచెప్పింది. శిక్షణతో కూడిన సిబ్బంది సంఖ్యను పెంచడం, సీసీటీవీ కెమెరాలను ఇన్​స్టాల్​ చేయడం, లైటింగ్​ సరిగ్గా ఉంచడం, సీపీఏ (కేంద్ర రక్షణ చట్టం) అమలు, అలర్ట్​ సిస్టెమ్స్​ ఏర్పాట్లు, డ్యూటీ రూమ్​లు కనీస అవసరాలు- లాకర్​ వంటివి ఏర్పాటు చేసి వైద్యుల భద్రతను పెంపొందించాలని ఐఎంఏ అధ్యయనం పేర్కొంది.

సంబంధిత కథనం