Rafah attack : ‘మాటలు రావడం లేదు’- రఫాలో ఇజ్రాయెల్ దాడిపై ప్రముఖుల ఆవేదన!
Rafah massacre : ఇజ్రాయెల్ దాడి తర్వాత రఫాలో చిన్నారుల ఆందోళనకర వీడియోపై సమంత, స్వర భాస్కర్, గౌహర్ ఖాన్, ఫాతిమా సనా షేక్ వంటి భారతీయ సెలబ్రిటీలు స్పందించారు.
Indian celebs show support for Palestine : దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ జరిపిన దాడి.. ఒక విషాదకరమైన తప్పిందమని అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించారు. పాలస్తీనియన్లు నివసిస్తున్న టెంట్ క్యాంపునకు నిప్పుపెట్టిన ఇజ్రాయెల్ దాడిలో కనీసం 45 మంది మరణించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ తాజా దాడిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సజీవ దహనమైన చిన్నారులతో సహా పౌరుల మరణాలపై పలువురు భారతీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ప్రస్తావిస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు ప్రముఖ నటి సమంత. 'రఫాలో ఇజ్రాయెల్ తన సైనిక దాడిని తక్షణమే నిలిపివేయాలని ఐసీజే (అంతర్జాతీయ న్యాయస్థానం) శుక్రవారం తీర్పు ఇచ్చిన తర్వాత ఇది (రఫాపై తాజా దాడి) జరిగింది. ఈ భీభత్సానికి మాటలు లేవు. సురక్షితమైన ప్రాంతం అంటూ ఎక్కడా లేదు. అది ఆగిపోవాలి. ఇప్పుడే కాల్పుల విరమణ జరగాలి," అని సమంత అన్నారు.
స్వర భాస్కర్
Israel attack on Rafah : పాలస్తీనా హక్కులకు మద్దతుదారుగా వ్యాఖ్యలు చేశారు నటి స్వర భాస్కర్. గతంలో ఫ్రీ పాలస్తీనా ఉద్యమానికి మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రఫా దాడిపై తన ఆగ్రహాన్ని, నిస్పృహను వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వరుస పోస్టులు పెట్టరు.
“పిల్లల తల నరికి గుడారాల్లో సజీవ దహనం చేయడంపై సమతుల్యమైన ప్రతిస్పందన ఉండాలని ఆశించే ప్రపంచంలో మేము నివసిస్తున్నాము!! ఈ పని చేసి, అందుకు సహకరించి, దీనికి నిధులు సమకూర్చి, దీనికి మద్దతిచ్చి, దీన్ని సాధారణీకరించడానికి ఒక కథనాన్ని తయారు చేసిన, సంబరాలు చేసుకున్న తెల్లజాతి ప్రజలకు నా హృదయంలో మాటలు లేవు, శాపాలు మాత్రమే ఉన్నాయి....,” అని పేర్కొన్నారు.
దియా మీర్జా
పాలస్తీనా అనుకూల నిరసనకు సంబంధించిన ఓ పోస్ట్‌ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు నటి దియా మీర్జా. పాలస్తీనాకు తన మద్దతును తెలియజేసేందుకు 'లెట్ గాజా లైవ్' పోస్టర్‌తో పాటు బ్లాక్, వైట్, ఎరుపు, ఆకుపచ్చ హార్ట్ ఎమోజీలను దియా మీర్జా జత చేశారు.
గౌహర్ ఖాన్
Rafah attac death toll : రఫా దాడి గురించి నటుడు సోమవారం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వరుస పోస్టులను పంచుకున్నాడు. "ఈ రాత్రి, గాజాలోని తల్లులు తమ పిల్లలను మళ్లీ పట్టుకుని, నిద్రపోతారని ఆశిస్తారు. వారు మేల్కొనాలని, మేము ప్రార్థిస్తామ," అని అన్నారు.
అలీ గోని
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే పోస్ట్‌ను షేర్ చేశారు. 'ఐసీజే ఆదేశాల తర్వాత 48 గంటల్లో ఇజ్రాయెల్ 60 సార్లు రఫాపై బాంబు దాడి చేసింది,' అనే పోస్టును ఆయన రీ షేర్ చేశారు.
ఫాతిమా సనా షేక్
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో "రఫాలో పిల్లల తల నరికిన వీడియోను చూశాను. దీన్ని ఇక విస్మరించలేం. ఇది ఎప్పుడు ముగుస్తుంది!" అని ఫాతిమా సనా షేక్ ప్రశ్నించారు.
రాధికా
నటి రాధికా ఆప్టే రఫా దాడికి సంబంధించి వరుస పోస్టులు పెట్టారు. "మాకు మాటలు కరువయ్యాయి. రఫా నుంచి బయటకు వచ్చిన వీడియోలు భయంకరంగా ఉన్నాయి. దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటివరకు మనం కలిసి చూసిన దానికంటే ఎక్కువ బాధాకరం,' అని పేర్కొన్నారు.
టీవీ నటుడు నకుల్ మెహతా
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇజ్రాయెల్‌కు పిలుపునిస్తూ ఒక పోస్ట్‌ని షేర్ చేశారు. 'మీ దేశం పిల్లల శిరచ్ఛేదం చేస్తుంటే, మీ దేశానికి మనుగడకు అర్హత లేదు," అని పేర్కొన్నారు.
సంబంధిత కథనం