Radhika Apte: నా బ్రెస్ట్స్ సైజు పెద్దగా లేదని వద్దన్నారు: రాధికా ఆప్టే
బాలీవుడ్‌లో ఆఫ్‌బీట్ మూవీస్‌లో కనిపిస్తూ నటనలో ఇరగదీస్తుంది రాధికా ఆప్టే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే అలవాటు ఉన్న ఆమె.. సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బహిరంగంగా మాట్లాడటానికి ఏమాత్రం సందేహించదు.
నటన పరంగా చూసుకుంటే ఇప్పుడు దేశంలోని బెస్ట్ యాక్టర్స్‌లో ఒకరు రాధికా ఆప్టే. అన్ని హావభావాలను అద్భుతంగా పండించే సత్తా ఆమెకు ఉంది. మంచి టాలెంట్ ఉన్న నటి. షోర్ ఇన్ ద సిటీ, ప్యాడ్ మ్యాన్, అంధాధున్‌లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. పార్చ్‌డ్, ది వెడ్డింగ్ గెస్ట్‌లాంటి మూవీస్‌లో చాలా బోల్డ్ సీన్లలోనూ నటించింది. ఈ రెండు సినిమాల్లో న్యూడ్‌గా నటించడానికి కూడా ఆమె వెనుకాడలేదు.
తెలుగులోనూ లెజెండ్, రక్తచరిత్ర, లయన్, కబాలిలాంటి సినిమాల్లో కనిపించింది. అయితే తరచూ ఆమె సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణంపై పబ్లిగ్గానే సంచలన విషయాలు చెబుతూ ఉంటుంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఎదురైన ఓ దారుణమైన అనుభవం గురించి వివరించింది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే సూటిపోటి మాటలు, వేధింపులకు ఆమె మాటలు అద్దం పడుతున్నాయి.
ఈ మధ్యే తాను ఓ సినిమాలో నటించే అవకాశం కోల్పోయానని ఆమె చెప్పింది. దీనికి కారణం తన వక్షోజాల సైజు పెద్దగా లేకపోవడమే అని రాధికా చెప్పడం గమనార్హం. నా పెదవులు, వక్షోజాలు పెద్దగా లేవని సినిమాలో తీసుకోవడానికి నిరాకరించారు.. నా కన్నా సెక్సీగా, ఎక్కువ మందిని ఆకర్షించే మరో నటిని మేకర్స్ తీసుకున్నారు అని రాధికా ఆప్టే చెప్పింది.
ఇక తన కాళ్లు, వక్షోజాలు, ముక్కు, చెంపలను సరి చేసుకోవడానికి సర్జరీలు చేసుకోమని కూడా సలహాలు ఇచ్చారని మరో ఇంటర్వ్యూలో రాధికా తెలిపింది. అయితే తాను మాత్రం రోల్స్ కోసం ఎప్పుడూ ఇలాంటి సర్జరీల జోలికి వెళ్లలేదని స్పష్టం చేసింది. ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో వారి మైండ్‌సెట్ ఒకేలా ఉందని ఆమె అనడం గమనార్హం. భవిష్యత్తులో అయినా మహిళలు పవర్‌ఫుల్ స్థానాల్లోకి వచ్చి ఈ పరిస్థితిలో మార్పు తేవాలని ఆమె కోరుకుంది.