RBI Officers Recruitment 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్-rbi officers recruitment 2024 apply for 94 posts at rbi org in details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rbi Officers Recruitment 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

RBI Officers Recruitment 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Jul 27, 2024 09:46 PM IST

RBI Officers Recruitment 2024: ఆర్బీఐ లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటఫికేషన్ విడుదల అయింది. అర్హులైన అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ rbi.org.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఆర్బీఐ లోని వివిధ శాఖల్లో 94 ఆఫీసర్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ (Reuters)

RBI Officers Recruitment 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ rbi.org.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 94 పోస్టులను భర్తీ చేయనున్నారు.

yearly horoscope entry point

లాస్ట్ డేట్ ఆగస్ట్ 16

ఆర్బీఐ లో ఆఫీసర్ పోస్టుల కు అప్లై చేయడానికి ఆఖరు తేదీ ఆగస్టు 16. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు 2024 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరుగుతాయి. దీనికి సంబంధించిన తేదీలు నోటిఫికేషన్ లో సవివరంగా ఉన్నాయి.

అర్హత, ఇతర వివరాలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అన్ని సెమిస్టర్లు/ సంవత్సరాల్లో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ / తత్సమాన సాంకేతిక లేదా వృత్తిపరమైన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు 50% ఉత్తీర్ణత ఉంటే చాలు. లేదా ఏదైనా విభాగంలో 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ / తత్సమాన సాంకేతిక లేదా వృత్తిపరమైన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు పాస్ మార్క్ లు సాధిస్తే చాలు.

ఎంపిక విధానం

ఎంపిక విధానంలో ఫేజ్ 1, ఫేజ్ 2, ఇంటర్వ్యూ ఉంటాయి. ఫేజ్-1 పరీక్షలో 200 మార్కులకు ఒకే పేపర్ ఉంటుంది. ఇది 2024 సెప్టెంబర్ 08 న జరుగుతుంది. అభ్యర్థుల సంఖ్యను బట్టి వేర్వేరు రోజుల్లో, పలు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఫేజ్-1 ఫలితాల ఆధారంగా, బోర్డు నిర్ణయించిన కటాఫ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఫేజ్-2 ఆన్ లైన్ పరీక్షను అక్టోబర్ 19, 2024న నిర్వహిస్తారు. ఫేజ్-2 పరీక్ష కూడా షిఫ్టుల్లో ఉంటుంది. ఫేజ్-2 (పేపర్-1+పేపర్-2+పేపర్-3)లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫేజ్ 2, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా సెలక్షన్ లిస్ట్ ను సిద్ధం చేస్తారు.

దరఖాస్తు ఫీజు

ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. 18% జీఎస్టీ అదనం. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.850 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. 18 శాతం జీఎస్టీ అదనం. అభ్యర్థులు డెబిట్ కార్డులు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డ్/ మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/ మొబైల్ వాలెట్లు, యూపీఐ ద్వారా అప్లికేషన్ ఫీజును చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆర్బీఐ (rbi) అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.