Rahul Gandhi : ‘కోహ్లీ.. రోహిత్’- ఈ క్రికెటర్స్‌లో రాహుల్ గాంధీ ఫేవరెట్ ఎవరంటే..!
Rahul Gandhi latest news : విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మలో ఇష్టమైన క్రికెటర్ ఎవరు? అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. మెస్సీ- రొనాల్డో గురించి కూడా మాట్లాడారు.
Rahul Gandhi rapid fire : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మల్లో ఎవరంటే ఎక్కువగా ఇష్టం? దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో.. వీటికి సమాధానం ఇచ్చారు రాహుల్ గాంధీ. ఆ విశేషాలు..
ఫుట్‌బాల్.. క్రికెట్..
ఆదివారం జరిగిన ఓ మీడియా కాన్క్లేవ్లో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. రాజకీయాలు, ఎన్నికలు వంటి అంశాల గురించి ప్రసగించారు. అదే సమయంలో.. ఓ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌కు సమాధానాలిచ్చారు.
ప్రశ్న:- మెస్సీ- రొనాల్డో.. ఈ ఇద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం?
సమాధానం:- రొనాల్డో కన్నా మెస్సీ బెస్ట్ అని నేను అనుకుంటాను. నేను ఒక ఫుట్‌బాల్ టీమ్ పెట్టాలనుకుంటే.. మెస్సీనే ఎంచుకుంటాను.
ప్రశ్న:- విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ.. ఈ ఇద్దరు క్రికెటర్స్‌లో ఎవరంటే మీకు ఇష్టం..?
Rahul Gandhi latest news : సమాధానం:- ఎవరు ఇష్టం లేరు. నేను పెద్దగా క్రికెట్ ఫ్యాన్‌ని కాదు. నాకు ఫుట్‌బాల్ అంటే ఇష్టం అంతే! ఇలా చెప్పడం సరైనది కాదని నాకు తెలుసు (ఇండియాలో క్రికెట్‌కు ఎక్కువ క్రేజ్ ఉంటుందని).
ఇదీ చూడండి:- Ram Pothineni Virat Kohli: విరాట్ కోహ్లీ బయోపిక్‍లో రామ్ పోతినేని? అప్పటి నుంచే మొదలంటూ!
ప్రశ్న:- నెట్‌ఫ్లిక్స్- వర్కౌట్.. ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటారు?
సమాధానం:- కచ్చితంగా వర్కౌట్! వ్యాయామం చేయడం నాకు ఇష్టం.
ప్రశ్న:- భారత జోడా యాత్రలో గడ్డం పెంచారు. తర్వాత క్లీన్ షేవ్ చేసుకున్నారు. ఈ రెండిట్లో మీకు ఏ లుక్ బాగా నచ్చింది?
సమాధానం:- నాకు వీటి మీద పెద్దగా అభిప్రాయాలు లేవు. గడ్డం ఉందా లేదా అని పట్టించుకోను. నాకు ఏదైనా పర్లేదు.
ప్రశ్న:- ఇండియా- లేదా భారత్? (పేరు మార్పు గురించి)
సమాధానం:- 'ఇండియా దట్ ఈజ్ భారత్' అని రాజ్యాంగంలో ఉన్న మాటలను కోట్ చేశారు రాహుల్ గాంధీ.
ప్రశ్న:- రాజకీయ నాయకుడు కాకపోతే.. మీరు ఏమవ్వాలని అనుకుంటారు?
సమాధానం:- ఏదైనా చేస్తాను. పిల్లలు, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు నేనొక టీచర్ని. వంటింట్లో ఉన్నప్పుడు చెఫ్‌ని. ఇలా చాలా ఉన్నాయి. రాజకీయాలు అనేవి ఒక భాగం మాత్రమే.
సంబంధిత కథనం