Asian Games : క్రీడల్లోనూ రాజకీయాలు.. అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్స్‌కు వీసా ఇవ్వని చైనా!
Asian Games : ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనాల్సి ఉన్న ముగ్గురు అరుణాచల్ ప్రదేశ్ ప్లేయర్స్‌కు వీసా ఇవ్వలేదు చైనా. ఈ వ్యవహారంపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది.
Asian Games 2023 : క్రీడల్లోనూ చైనా రాజకీయాలు చేస్తోంది! తాజాగా.. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు అథ్లెట్స్‌కు ఆ దేశం వీసాలు మంజూరు చేయలేదు. ఈ వ్యవహారంపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. చైనా చర్యలపై నిరసనగా.. భారత దేశ క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఇదీ జరిగింది..
భారత్- చైనాల మధ్య సరిహద్దు వ్యవహారంలో ఎప్పటినుంచో ఉద్రిక్తత కొనసాగుతోంది. ముఖ్యంగా.. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా చెబుతూ వస్తోంది. ఈశాన్య రాష్ట్రం.. తమ భూభాగం అని భారత్ తేల్చిచెబుతోంది.
Asian games India : ఉషు అనే మార్షల్ ఆర్ట్స్ క్రీడలో అరుణచల్ ప్రదేశ్ నుంచి ముగ్గురు ప్లేయర్లు 2023 ఏషియన్ గేమ్స్‌కు ఎంపికయ్యారు. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా.. వీరికి షాక్ తగిలింది! చైనాలో ఎంట్రీ కోసం అక్రిడీషన్ కార్డ్స్ చాలా కీలకం. అలాంటిది.. ఒనిలు తెగ, ఎంపుంగ్ లంగు ప్లేయర్లు.. తమ అక్రిడీషన్ కార్డులను డౌన్లోడ్ చేసుకోలేక పోయారు. మూడో అరుణాచల్‌ప్రదేశ్ వాసి నెయ్నమ్ వంగ్సుకు అక్రిడీషన్ కార్డు వచ్చినా.. ఆమెను హాంగ్ కాంగ్ దాటి ప్రయాణాలు చేయకూడదని షరుతులు విధించింది చైనా.
ఇదీ చూడండి:- Asian Games 2023: ఏషియన్ గేమ్స్‌లో ఇండియా ఫ్లాగ్ బేరర్లు ఈ ఒలింపిక్ మెడలిస్టులే..
ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.
Asian games live updates 2023 : "చైనా చర్యలకు వ్యతిరేకంగా భారత్ నిరసన వ్యక్తం చేస్తోంది. క్రీడాశాఖ మంత్రి తన చైనా ట్రిప్‌ను రద్దు చేసుకుంటున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని క్రీడాకారులను చైనా టార్గెట్ చేస్తోంది. హంగ్జౌలో జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌కు వారికి అక్రిడీషన్ కార్డులు ఇవ్వలేదు. భారతీయులతో చైనా ఈ విధంగా ప్రవర్తిస్తుండటాన్ని ప్రభుత్వం ఖండిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ అనేది ఎప్పటికీ భారత్‌లో భాగమే," అని విదేశాంగశాఖ ప్రతినిధి ఆరిందమ్ బగ్చి తెలిపారు.
"ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లాము. చాలా బలంగా మా వాదనలు వినిపించాము. కొందరు క్రీడాకారులను ఇలా నియంత్రించడం సరైనది కాదు. ఇది ఏషియన్ గేమ్స్ స్ఫూర్తికి విరుద్ధం," అని ఆరిందమ్ బగ్చి వెల్లడించారు.
ఏషియన్ గేమ్స్..
ఈ మెగా ఈవెంట్లో కొన్ని పోటీలు ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ.. అసలు ఓపెనింగ్ ఈవెంట్ మాత్రం శనివారం జరగనుంది. చైనాలో హాంగ్జౌ నగరం ఈసారి ఏషియన్ గేమ్స్ కు ఆతిథ్యమిస్తోంది. ఈసారి ఏషియన్ గేమ్స్ లో ఏకంగా 12 వేల మందికిపైగా అథ్లెట్లు పోటీ పడుతున్నారు. ఈ విషయంలో ఏషియన్ గేమ్స్.. ఒలంపిక్స్నే మించిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం