Ramnath Kovind : రాష్ట్రపతి హోదాలో రామ్​నాథ్​ కొవింద్​ చివరి ప్రసంగం..-quotes from ramnath kovind farewell speech today on 24th july 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Quotes From Ramnath Kovind Farewell Speech Today On 24th July 2022

Ramnath Kovind : రాష్ట్రపతి హోదాలో రామ్​నాథ్​ కొవింద్​ చివరి ప్రసంగం..

Sharath Chitturi HT Telugu
Jul 24, 2022 08:22 PM IST

Ramnath Kovind farewell speech : రాష్ట్రపతి హోదాలో రామ్​నాథ్​ కొవింద్​ చివరిగా ఆదివారం సాయంత్రం ప్రసంగించారు. పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు.

రామ్​నాథ్​ కొవింద్​
రామ్​నాథ్​ కొవింద్​ (ANI)

Ramnath Kovind farewell speech : రాష్ట్రపతి కార్యాలయంలో రామ్​నాథ్​ కొవింద్​కు ఆదివారమే చివరి రోజు. నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము.. సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రామ్​నాథ్​ కొవింద్​. రాష్ట్రపతిగా తన ప్రయాణాన్ని తన ప్రసంగంలో వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

రామ్​నాథ్​ సింగ్​ మాటలు..

  • "ప్రజలకు, ప్రజాప్రతినిధులకు నా కృతజ్ఞతలు. దేశవ్యాప్తంగా ప్రజలతో జరిపిన సంభాషణలు నాలో స్ఫూర్తిని నింపాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి నాకు సహకారం, ఆశిస్సులు లభించాయి.
  • పరౌంఖ్​ అనే చిన్న గ్రామానికి చెందిన రామ్​నాథ్​ కొవింద్​ అనే వ్యక్తి.. ఈరోజు ఇక్కడ ప్రసంగిస్తున్నాడు అంటే.. అది ప్రజాస్వామ్య వ్యవస్థల వల్లే సాధ్యమైంది.
  • ఇండియాకు మూలలు, విలువలే కీలకం. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని యువతకు నేను అభ్యర్థిస్తున్నాను. గ్రామాలు, టౌన్​లు, స్కూళ్లు- అక్కడి టీచర్లతో సంబంధాలను కొనసాగించండి.
  • రాష్ట్రపతి హోదాలో నా గ్రామానికి వెళ్లడం, కాన్పూర్​లో ఉన్న మా టీచర్​ పాదాలకు నమస్కరించడం.. నా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకాలు.
  • మన నిత్య జీవితంలో.. మనుషులతో పాటు ప్రకృతిని కూడా రక్షించేందుకు చర్యలు చేపట్టాలి.
  • ప్రకృతి చాలా కోపంగా ఉంది. వాతావరణ సంక్షోభం అనేది భూమి భవిష్యత్తునే నాశనం చేస్తుంది. మన పిల్లల కోసం పర్యావరణం, భూమి, గాలి, నీటిని పరిరక్షించుకోవాలి.
  • 19వ శతాబ్దాంలో దేశంలో ఎన్నో కీలక అంశాలు చోటుచేసుకున్నాయి. దేశాభివృద్ధికి పాటుపడిన హీరోల పేర్లును మర్చిపోయారు. వారిలో కొందరి పేర్లు, వారు చేసిన పనులు.. ఇప్పుడు మళ్లీ బయటకొస్తున్నాయి.
  • ఇండియా.. అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోంది. 21శతాబ్దం.. భారత దేశానిదే అని నాకు బలమైన నమ్మకం కలుగుతోంది.
  • భారతీయులు.. తమ వారసత్వ విలువలతో సంబంధం ఏర్పరచుకునేందుకు.. 21శతాబ్దంలో మనుగడ సాగించేందుకు.. జాతీయ విద్యా విధానం ఉపయోగపడుతుంది."

WhatsApp channel

సంబంధిత కథనం