PM Scholarship Schemes : మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ 5 పీఎం స్కాలర్‌షిప్ స్కీమ్స్ గురించి తెలుసా?
PM Scholarship Schemes : పేద పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. పిల్లల చదువులకు డబ్బు ఇబ్బంది కాకుండా చూస్తోంది. అటువంటి టాప్ స్కాలర్‌షిప్ పథకాల గురించి తెలుసుకుందాం.. ఈ పథకాలను ద్వారా మీరు పిల్లల విద్య కోసం ప్రభుత్వం నుండి డబ్బు పొందవచ్చు.
విద్యార్థులు చదువుకునేందుకు డబ్బుల కొరత రాకుండా ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువస్తుంది. దీని ద్వారా అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే విధానాన్ని తీసుకుంది. ఈ విధంగా పిల్లల చదువుల కోసం కూడా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోంది. మీ బిడ్డకు చదివించేందుకు మీరు ఇబ్బందిపడుతుంటే.. కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం..
ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ పథకం
మీరు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ పథకం కింద ప్రతి సంవత్సరం 5,500 మంది పిల్లలను ఎంపిక చేస్తారు. వీరిలో 2750 మంది బాలురు, 2750 మంది బాలికలు ఉంటారు. ఈ పథకం కింద పిల్లలకు నెలకు 2500 నుండి 3000 అందిస్తారు. వారి మొత్తం విద్యా జీవితానికి ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. దీనికి సంబంధించి అందుతున్న సమాచారం ప్రకారం ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ పథకం కింద బాలికలకు నెలకు 3000, అబ్బాయిలకు 2500 చొప్పున అందజేయనున్నారు.
PM యశస్వి
పీఎం యశస్వి ద్వారా ఉన్న విద్య కోసం స్కాలర్‌షిప్ పొందవచ్చు. ఈ పథకం కింద(OBC), EBC, సంచార తెగలకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉంటాయి. మొదటి షరతు ఏంటంటే ఏ కళాశాల లేదా విశ్వవిద్యాలయాన్ని ఎంచుకున్నా nta.ac.inలో జాబితా చేసి ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.2.50 లక్షలకు మించకూడదు. ప్రతి నెలా వసతి కోసం మూడు వేలు, పుస్తకాలకు ఏడాదికి ఐదు వేలు ఇస్తారు. విద్యార్ధులకు చదువు కోసం కంప్యూటర్, ల్యాప్‌టాప్, UPS, ప్రింటర్ వంటి వాటిని అందజేస్తారు. ఈ వస్తువుల ధర రూ.45 వేలు. దీనితోపాటుగా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ప్రధాన్ మంత్రి ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకం
ప్రధానమంత్రి ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ప్రారంభించింది. ఈ పథకం కింద జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ల విద్యార్థులకు ఇతర ఏ రాష్ట్రంలోనైనా ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక సహాయం అందిస్తారు. PMSSS పథకం కింద, విద్యార్థులకు వసతి, ఆహారం కోసం రూ. 1 లక్ష లభిస్తుంది. చదువుల కోసం ఇచ్చే ఖర్చులు వేర్వేరు డిగ్రీల ఆధారంగా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా జనరల్ డిగ్రీ చేస్తే రూ.30,000. కానీ ఎవరైనా ఇంజినీరింగ్ డిగ్రీ చేయాలంటే రూ.1లక్ష 25వేలుగా ఉంటుంది. కానీ మెడికల్ డిగ్రీకి 3 లక్షలు పొందవచ్చు.
పీఎం యూఎస్‌పీ
ప్రధానమంత్రి ఉన్నత విద్యా పథకాన్ని PM-USP పథకం అని కూడా అంటారు. ఈ పథకం కింద ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రతి సంవత్సరం సుమారు 82 వేల మంది విద్యార్థులు ఈ పథకానికి ఎంపిక అవుతారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఏడాదికి 12 వేలు ఇస్తారు.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కింద, ఉన్నత విద్యలో మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ఆర్థికంగా బలహీనమైన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఫీజు కోసం సహాయం చేస్తారు. ఇది కాకుండా విద్యార్థి ప్రొఫైల్ ఆధారంగా అనేక ఇతర ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.