H1B visa rules : భారతీయులకు మోదీ గుడ్​ న్యూస్​.. హెచ్​1బీ వీసా రూల్స్​పై కీలక అప్డేట్​-pm modi announces big changes in us h1b visa rules for indian professionals ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  H1b Visa Rules : భారతీయులకు మోదీ గుడ్​ న్యూస్​.. హెచ్​1బీ వీసా రూల్స్​పై కీలక అప్డేట్​

H1B visa rules : భారతీయులకు మోదీ గుడ్​ న్యూస్​.. హెచ్​1బీ వీసా రూల్స్​పై కీలక అప్డేట్​

Sharath Chitturi HT Telugu
Jun 24, 2023 07:34 AM IST

H1B visa rules : ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసింది. అంతకుముందు.. హెచ్​1బీ వీసా నిబంధనలపై కీలక అప్డేట్​ ఇచ్చారు మోదీ.

భారతీయులకు మోదీ గుడ్​ న్యూస్​.. హెచ్​1బీ వీసాపై కీలక అప్డేట్​
భారతీయులకు మోదీ గుడ్​ న్యూస్​.. హెచ్​1బీ వీసాపై కీలక అప్డేట్​ (AP)

H1B visa rules : అమెరికా పర్యటనలో భాగంగా.. భారతీయులకు తీపికబురును అందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రానున్న రోజుల్లో బెంగళూరు, అహ్మదాబాద్​లలో అమెరికన్​ కాన్సులేట్​లు ఓపెన్​ అవుతాయని ప్రకటించారు. అమెరికా వీసా పొందాలని చూస్తున్న వారికి ఇది గుడ్​ న్యూస్​ అనే చెప్పాలి.

భారతీయులకు రిలీఫ్​..!

అదే సమయంలో.. హెచ్​1బీ వీసా నిబంధనలపైనా కీలక అప్డేట్​ ఇచ్చారు మోదీ. ఇకపై హెచ్​1బీ వీసాలను అమెరికాలోనే రెన్యువల్​ చేయించుకునే విధంగా నిబంధనలను మార్చాలని అమెరికా ప్రభుత్వం ప్లాన్​ చేస్తున్నట్టు వెల్లడించారు. అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతినిచ్చేదే ఈ హెచ్​1బీ వీసా. ప్రస్తుతం.. వీసాను పునరుద్ధరించుకోవాల్సి వస్తే.. సంబంధిత వ్యక్తులు సొంత దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. పునరుద్ధరణ ప్రక్రియకు నెలలు లేదా సంవత్సరాలు కూడా గడిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంతలో.. సంబంధిత వ్యక్తి కుటుంబం మాత్రం అమెరికాలోనే ఉండిపోతోంది. ఇక ఇప్పుడు.. ప్రధాని మోదీ చెప్పిన మాటలు నిజమైతే.. అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారతీయులకు లబ్ధిచేకూరినట్టే!

అమెరికా పర్యటన పూర్తయ్యే కొన్ని గంటల ముందు.. వాషింగ్టన్​లో భారత సమాజాన్ని ఉద్దేశించి జరిగిన ఈవెంట్​లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.

Modi US visit live updates : "భారత్​లో రెండు కొత్త అమెరికా కాన్సులేట్​లు ఓపెన్​ అవుతాయి. బెంగళూరు, అహ్మదాబాద్​లో అవి ఉంటాయి. హెచ్​1బీ వీసా పునరుద్ధరణ నిబంధనలను కూడా మార్చేందుకు అమెరికా కృషిచేస్తోంది," అని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​- ప్రధాని మోదీ మధ్య కొన్ని రోజుల క్రితం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. భారత్​ కూడా అమెరికాలో తన కాన్సులేట్​లను ఓపెన్​ చేయనుంది. సియాటెల్​తో పాటు మరో రెండు నగరాల్లో ఈ ఏడాది భారత్​ కాన్సులేట్​లు తెరుచుకోనున్నాయి.

"రెండు దేశాలు కలిసి విధానాలు, ఒప్పందాలను రూపొందించడం లేదు. మేము ప్రజల ఆశలు, కలలకు మార్గాన్ని చూపిస్తున్నాము," అని మోదీ అన్నారు.

సుందర్​ పిచాయ్​తో భేటీ..

భారతీయ సమాజంతో సమావేశానికి ముందు.. పలు పెట్టుబడిదారులు, వివిధ సంస్థల సీఈఓలతో మోదీ సమావేశమయ్యారు. ప్రధానిని కలిసిన అనంతరం గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ కీలక ప్రకటన చేశారు. గుజరాత్​లో గూగుల్​కు చెందిన ఫిన్​టెక్​ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. డిజిటల్​ ఇండియాపై మోదీ విజన్​ను ఆయన కొనియాడారు.

ఈజిప్ట్​కు మోదీ..

Modi Egypt trip : ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ నెల 20న అమెరికాకు వెళ్లిన ఆయనకు ప్రతిచోటా ఘన స్వాగతం లభించింది. ఇక ఇప్పుడు.. అమెరికా నుంచి ఈజిప్ట్​కు బయలుదేరారు మోదీ.

Whats_app_banner

సంబంధిత కథనం