Google Pixel 6a discount: భారీ డిస్కౌంట్ తో గూగుల్ పిక్సెల్ 6ఏ.. ఎక్కడో తెలుసా..?
సక్సెస్ ఫుల్ మోడల్ గూగుల్ పిక్సెల్ 6ఏ ప్రస్తుతం అత్యంత భారీ డిస్కౌంట్ లో లభిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధర కే ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 6 ఏ ఎక్కడ లభిస్తోందో తెలుసా..?

సక్సెస్ ఫుల్ మోడల్ గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) ప్రస్తుతం అత్యంత భారీ డిస్కౌంట్ లో లభిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధర కే ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 6 ఏ ఎక్కడ లభిస్తోందో తెలుసా..?
భారీ డిస్కౌంట్ తో..
లేటెస్ట్ గా గూగుల్ పిక్సెల్ 7 (Google Pixel 7) సిరీస్ లాంచ్ అయింది. గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రొ స్మార్ట్ ఫోన్స్ ధర ఇప్పుడు భారీగా ఉంది. దాంతో, గూగుల్ పిక్సెల్ 6 ఏ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ (Flipkart) లో డిస్కౌంట్ లో లభిస్తోంది. పూర్తిగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఉన్న గూగుల్ 6 ఏ ఒరిజినల్ ధర రూ. 43999. ఈ ధరపై ఫ్లిప్ కార్ట్ 34% డిస్కౌంట్ అందిస్తోంది. అంటే, దాదాపు 16 వేల వరకు తగ్గింపు ఉంటుంది. అంటే, మిగతా ఆఫర్స్ ఏవీ వద్దనుకుంటే రూ. 27,999 లకు ఫ్లిప్ కార్ట్ లో గూగుల్ పిక్సెల్ 6 ఏ లభిస్తుంది. లేదా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ప్రయోజనాలను కూడా తీసుకుంటే ఈ ధర మరింత తగ్గుతుంది.
రూ. 26,700 వరకు ఎక్స్చేంజ్ బోనస్
ఎక్స్చేంజ్ ఆఫర్ లో మీ వద్ద ఉన్న ఏదైనా వర్కింగ్ కండిషన్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే.. రూ. 26700 వరకు వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అయితే, ఈ ఎక్స్చేంజ్ బోనస్ మొత్తం మీరు ఎక్స్చేంజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్, మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఇంతేకాదు, ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ లో బ్యాంక్ ఆఫర్స్ ను కూడా పొందవచ్చు. ఈ గూగుల్ పిక్సెల్ 6 ఏ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. మీకు రూ. 1250 తక్షణ తగ్గింపు లభిస్తుంది. లేదా ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు, ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేస్తే 5% డిస్కౌంట్ లభిస్తుంది.