'మోదీ' మేనియా మధ్య ముగిసిన ప్రధాని అమెరికా పర్యటన-pm modi concludes his first state visit to the united states heads to egypt ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'మోదీ' మేనియా మధ్య ముగిసిన ప్రధాని అమెరికా పర్యటన

'మోదీ' మేనియా మధ్య ముగిసిన ప్రధాని అమెరికా పర్యటన

Jun 24, 2023, 07:03 AM IST Sharath Chitturi
Jun 24, 2023, 07:03 AM , IST

  • మోదీ మేనియా మధ్య ప్రధానమంత్రి అమెరికా పర్యటన ముగిసింది. ఈ నెల 20న అమెరికా వెళ్లిన ఆయనకు ప్రతిచోటా ఘన స్వాగతం లభించింది. ఇక ఇప్పుడు.. ప్రధాని మోదీ అమెరికా నుంచి ఈజిప్ట్​కు బయలుదేరారు.

"ప్రత్యేకమైన అమెరికా పర్యటన ముగిసింది. అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను కలిసి భారత్​- అమెరికా స్నేహాన్ని మరింత పెంపొందించే అవకాశం నాకు దక్కింది. ప్రపంచాన్ని మెరుగైన స్థానానికి తీసుకెళ్లేందుకు మా రెండు దేశాలు కృషి చేస్తాయి," మోదీ ట్వీట్​ చేశారు.

(1 / 5)

"ప్రత్యేకమైన అమెరికా పర్యటన ముగిసింది. అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను కలిసి భారత్​- అమెరికా స్నేహాన్ని మరింత పెంపొందించే అవకాశం నాకు దక్కింది. ప్రపంచాన్ని మెరుగైన స్థానానికి తీసుకెళ్లేందుకు మా రెండు దేశాలు కృషి చేస్తాయి," మోదీ ట్వీట్​ చేశారు.(REUTERS)

అంతకుముందు.. వాషింగ్టన్​లోని కెన్నడీ సెంటర్​లో జరిగిన యూఎస్​ఐఎస్​పీఎఫ్​ ఈవెంట్​లో ప్రధాని పాల్గొన్నారు. వందలాది మంది భారత సంతతి అమెరికాన్లు ఈ ఈవెంట్​కు హాజరయ్యారు.

(2 / 5)

అంతకుముందు.. వాషింగ్టన్​లోని కెన్నడీ సెంటర్​లో జరిగిన యూఎస్​ఐఎస్​పీఎఫ్​ ఈవెంట్​లో ప్రధాని పాల్గొన్నారు. వందలాది మంది భారత సంతతి అమెరికాన్లు ఈ ఈవెంట్​కు హాజరయ్యారు.(ANI)

"భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది. ఆధునిక ప్రజాస్వామ్యానికి అమెరికా ఒక ఛాంపియన్​. ఈరోజున.. రెండు అతిపెద్ద దేశాల స్నేహాన్ని ప్రపంచం మొత్తం చూస్తోంది. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది," అని ప్రధాని అన్నారు. మోదీ మాట్లాడుతున్న ప్రతిసారి.. చప్పట్లతో సభాప్రాంగణం హోరెత్తిపోయింది.

(3 / 5)

కాగా.. భారతీయ సంఘాలతో సమావేశానికి ముందు.. పలు పెట్టుబడిదారులు, వివిధ సంస్థల సీఈఓలతో మోదీ సమావేశమయ్యారు,

(4 / 5)

కాగా.. భారతీయ సంఘాలతో సమావేశానికి ముందు.. పలు పెట్టుబడిదారులు, వివిధ సంస్థల సీఈఓలతో మోదీ సమావేశమయ్యారు,

ప్రధానిని కలిసిన అనంతరం గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ కీలక ప్రకటన చేశారు. గుజరాత్​లో గూగుల్​కు చెందిన ఫిన్​టెక్​ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. డిజిటల్​ ఇండియాపై మోదీ విజన్​ను ఆయన కొనియాడారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు