Derek O'Brien suspended: రాజ్యసభ చైర్మన్ తో ఘర్షణ; సభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ సస్పెన్షన్-parliament winter session derek obrien suspended after faceoff ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Derek O'brien Suspended: రాజ్యసభ చైర్మన్ తో ఘర్షణ; సభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ సస్పెన్షన్

Derek O'Brien suspended: రాజ్యసభ చైర్మన్ తో ఘర్షణ; సభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ సస్పెన్షన్

HT Telugu Desk HT Telugu
Dec 14, 2023 01:04 PM IST

Derek O'Brien suspended: పార్లమెంటులో భద్రతావైఫల్యం ఘటనపై చర్చకు పట్టుబడుతూ, సభలో అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రీన్ ను ఈ పార్లమెంటు శీతాాకాల సమావేశాల్లో పాల్గొనకూడదని బహిష్కరించారు.

రాజ్యసభ చైర్మన్ జగదీశ్ ధన్ కర్
రాజ్యసభ చైర్మన్ జగదీశ్ ధన్ కర్

Derek O'Brien suspended: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ను రాజ్య సభ నుంచి బహిష్కరించారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఆయన ఇకపై సభకు హాజరు కాకూడదని స్పష్టం చేశారు. పార్లమెంటులో భద్రతావైఫల్యం (Parliament security breach) ఘటనపై చర్చకు పట్టుబట్టినందుకు గానూ ఆయనకు ఈ శిక్ష విధించారు. , చైర్మన్ ఆదేశాలను ఉల్లంఘించడం, సభా మర్యాదలను పట్టించుకోకపోవడం వంటి ఆరోపణలతో ఆయనను సస్పెండ్ చేశారు.

పార్లమెంటులో భద్రతావైఫల్యం

లోక్ సభ జరుగుతుండగా బుధవారం ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ లో నుంచి సభలో దూకి చేతిలోని స్మోక్ కాన్స్టర్ ద్వారా పసుపు రంగు పొగను వెదజల్లిన విషయం తెలిసిందే. ఆ ఘటన (Parliament security breach) దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అలాగే, నూతన పార్లమెంటు భవనంలో ఎంపీల భద్రతకు సంబంధించి పలు ప్రశ్నలను లేవనెత్తింది.

చర్చకు పట్టు..

ఈ నేపథ్యంలో గురువారం రాజ్య సభలో టీఎంసీ, కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు పార్లమెంటులో భద్రతావైఫల్యం ఘటనపై చర్చకు పట్టుబట్టాయి. విపక్ష పార్టీల సభ్యులు ఇతర సభా కార్యక్రమాలకు విఘాతం కల్పిస్తూ, నినాదాలు చేశారు. పార్లమెంటులో భద్రతావైఫల్యం ఘటనపై హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ చైర్మన్ పలుమార్లు వారించినా, వారు వినలేదు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రీన్, పలువురు కాంగ్రెస్ ఎంపీలు చైర్మన్ జగదీశ్ ధన్ కర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దాంతో, డెరెక్ ఓబ్రీన్ ను సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా చైర్మన్ జగదీశ్ ధన్ కర్ ఆదేశించారు. ఆ ఆదేశాలను డెరెక్ ఓబ్రీన్ పట్టించుకోకపోవడంతో డెరెక్ ఓబ్రీన్ ను సస్పెండ్ చేసే తీర్మానాన్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఈ శీతాకాల సమావేశాల్లో డెరెక్ ఓబ్రీన్ పాల్గొనకుండా నిషేధం విధిస్తూ రూపొందించిన ఆ తీర్మానం ఆమోదం పొందింది.