Odisha floods : వరదలతో అల్లకల్లోలంగా ఒడిశా.. 9.6లక్షల మందిపై ప్రభావం!-odisha floods almost 9 6 lakh people affected due to floods and heavy rains ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Odisha Floods : వరదలతో అల్లకల్లోలంగా ఒడిశా.. 9.6లక్షల మందిపై ప్రభావం!

Odisha floods : వరదలతో అల్లకల్లోలంగా ఒడిశా.. 9.6లక్షల మందిపై ప్రభావం!

Livemint HT Telugu
Aug 23, 2022 07:27 AM IST

Odisha floods 2022 : ఒడిశాలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు 9.6లక్షల మంది ప్రజలపై వరదల ప్రభావం పడింది.

<p>వరద ముప్పు ప్రాంతాల్లో ఏరియల్​ సర్వే చేపట్టిన నవీన్​ పట్నాయక్​</p>
వరద ముప్పు ప్రాంతాల్లో ఏరియల్​ సర్వే చేపట్టిన నవీన్​ పట్నాయక్​ (PTI)

Odisha floods : భారీ వర్షాలు, వరదలకు ఒడిశా గడగడలాడుతోంది. ముఖ్యంగా.. బాలాసోర్​ సహా ఉత్తర ఒడిశాలోని అనేక జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్క ఉత్తర ఒడిశా జిల్లాల్లోనే.. 134 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడి ప్రజలు సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు!

మొత్తం మీద రాష్ట్రంలోని 9.66 లక్షలమంది ప్రజలపై ఒడిశా వరదల ప్రభావం పడింది. బాలాసోర్​, మయూర్​భంజ్​, జాజ్​పూర్​, భద్రక్​ జిల్లాల్లోని 251 గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

<p>భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలు</p>
భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలు

ఒడిశాలో భారీ వర్షాల కారణంగా.. రాష్ట్రంలోని నదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తుండటం మరో ఆందోళనకర విషయం. సుబర్నరేఖ, బుధబలంగ్​, జలక, వైతరణి నదులు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. గత కొన్ని రోజులుగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.

Odisha rains news : ఒడిశాలో ఒకేసారి రెండు భారీ స్థాయి వరదలు వచ్చిపడటం ఆందోళకరం. ఇప్పటికే రాష్ట్రంలోని తూర్పు ప్రాంత ప్రజలు వరదల్లో చిక్కుకోగా.. ఇప్పుడు ఉత్తర ప్రాంతాల్లోనూ ప్రభావం పడింది. తూర్పు ప్రాంతంలోని మహానది.. పొంగి పొర్లడంతో సమీపంలోని వరి పొలాలు నాశనమయ్యాయి.

ఒడిశా వరదల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది. ఇప్పటికే 440 శిబిరాలను ఏర్పాటు చేసింది. ఆయా శిబిరాల్లో 1.71లక్షల మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. వరద ముప్పు ప్రాంతాల్లో.. కొన్ని రోజుల క్రితమే ఏరియల్​ సర్వే నిర్వహించారు సీఎం నవీన్​ పట్నాయక్​.

Odisha floods news : "బాలాసోర్​ జిల్లాలోని 156 గ్రామాలు, 83 గ్రామ పంచాయతీలపై ఒడిశా వరదల ప్రభావం పడింది. సోమవారం మధ్యాహ్నం నాటికి 40వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాము. 227 తాత్కాలిక శిబిరాలను సైతం ఏర్పాటు చేశాము," అని జిల్లా కలక్టర్​ దత్తాత్రేయ భౌసాహెబ్​ శిండే పేర్కొన్నారు.

<p>వరదలతో ప్రభావితమైన ఓ గ్రామం పరిస్థితి</p>
వరదలతో ప్రభావితమైన ఓ గ్రామం పరిస్థితి

ఒడిశా ప్రజలకు ఇప్పట్లో కష్టాలు తీరేడట్టు కనిపించడం లేదు. రాష్ట్రంలో మంగళ, బుధావారాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా బాలాసోర్​పై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.

Whats_app_banner

సంబంధిత కథనం