NIACL AO Recruitment 2024: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ల రిక్రూట్మెంట్-niacl ao recruitment 2024 apply for 170 officer posts direct link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Niacl Ao Recruitment 2024: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ల రిక్రూట్మెంట్

NIACL AO Recruitment 2024: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ల రిక్రూట్మెంట్

Sudarshan V HT Telugu
Sep 10, 2024 03:50 PM IST

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్ఐఏసీఎల్ అధికారిక వెబ్ సైట్ newindia.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 170 ఏఓ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ల రిక్రూట్మెంట్
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ల రిక్రూట్మెంట్ (NIACL)

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ () అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు న్ఐఏసీఎల్ అధికారిక వెబ్సైట్ newindia.co.in ఎ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 170 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్ సెప్టెంబర్ 29

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ () అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు 2024 సెప్టెంబర్ 10 నుంచి 2024 సెప్టెంబర్ 29వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫేజ్-1 ఆన్ లైన్ పరీక్షను 2024 అక్టోబర్ 13న నిర్వహిస్తారు. ఫేజ్-2 పరీక్షను 2024 నవంబర్ 17న నిర్వహించనున్నారు.

ఖాళీల వివరాలు

అకౌంట్స్: 50 పోస్టులు

జనరలిస్టులు: 120 పోస్టులు

అర్హత ప్రమాణాలు

జనరలిస్టులు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హతతో జనరల్ అభ్యర్థులకు డిగ్రీ పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

స్పెషలిస్టులు: అభ్యర్థి సంబంధిత విభాగంలో కనీస విద్యార్హత కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

జనరలిస్ట్, స్పెషలిస్ట్ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయోపరిమితి 1.9.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ మూడు ఫేజ్ ల్లో జరుగుతుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3 ఇంటర్వ్యూ రౌండ్. మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్), ఇంటర్వ్యూ కన్సాలిడేటెడ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు సాధించిన కన్సాలిడేటెడ్ మార్కుల క్రమంలో తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు.

దరఖాస్తు ఫీజు

ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మినహా మిగతా అభ్యర్థులకు రూ.850 (జీఎస్టీతో కలిపి) అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100 చెల్లించాలి. దరఖాస్తు ఫీజును ఆన్ లైన్ లో డెబిట్ కార్డులు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్ఐఏసీఎల్ అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.

Whats_app_banner