NEET UG 2024 registration: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2024 మార్చి 16న ముగించనుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రిజిస్ట్రేషన్ లింక్ రేపు, మార్చి 16, 2024 రాత్రి 10.50 గంటల వరకు యాక్టివ్ గా ఉంటుంది. ఫీజు చెల్లింపు విండో రాత్రి 11.50 గంటలకు ముగుస్తుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎన్టీఏ నీట్ అధికారిక వెబ్సైట్స్ neet.ntaonline.in లేదా exams.nta.ac.in ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.
నీట్ యూజీ - 2024 (NEET UG 2024) కోసం దరఖాస్తు చేయడానికి మరో అవకాశం ఉండదని, లాస్ట్ డేట్ ను పొడిగించబోమని, అందువల్ల విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారిక నోటీసులో పేర్కొన్నారు. విద్యార్థులు నోటిఫికేషన్ లోని అన్ని సూచనలను జాగ్రత్తగా చదివి, ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయాలని సూచించారు. విద్యార్థులు ముందుగా neet.ntaonline.in. వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్ ను నింపే ప్రక్రియను ప్రారంభించాలన్నారు.
నీట్ యూజీ 2024 కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేయడానికి, విద్యార్థులు ఈ క్రింది దశలను అనుసరించాలి.
నీట్ యూజీ (NEET UG 2024 registration) దరఖాస్తు ఫీజు జనరల్/ ఎన్ఆర్ఐ కేటగిరీ అభ్యర్థులకు రూ.1700, జనరల్-ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.1000 గా నిర్ణయించారు. ఈ అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ లోనే చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత, నీట్ యూజీ 2024 కరెక్షన్ విండో (NEET UG 2024 correction window) తేదీలను ఎన్టీఏ విడుదల చేస్తుంది. ఆ కరెక్షన్ విండో మార్చి 18 నుంచి మార్చి 20న రాత్రి 11.50 గంటల వరకు యాక్టివ్ గా ఉంటుంది. ఈ సమయంలో అప్లికేషన్ లలో ఏవైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు. ఈ గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లికేషన్ లో దిద్దుబాట్లను అనుమతించరు. పూర్తి వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ నీట్ అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.