LIC IPO | షేర్లు అలాట్​ అయ్యాయా? అయితే మీకు నష్టాలు తప్పవు!-lic ipo gmp today shares may have a discounted debut ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lic Ipo | షేర్లు అలాట్​ అయ్యాయా? అయితే మీకు నష్టాలు తప్పవు!

LIC IPO | షేర్లు అలాట్​ అయ్యాయా? అయితే మీకు నష్టాలు తప్పవు!

HT Telugu Desk HT Telugu
May 13, 2022 10:36 AM IST

LIC IPO GMP today | ఎల్​ఐస ఐపీఓ షేర్ల అలాట్​మెంట్​ కూడా వచ్చేసింది. ఇక లిస్టింగ్​ డే కోసం అందరు ఎదురుచూస్తున్నారు. కాగా.. ప్రస్తుతం గ్రే మార్కెట్​ ప్రీమయంను పరిశీలిస్తే.. ఐపీఓకు నష్టాలు తప్పవని స్పష్టమవుతోంది!

<p>ల్​ఐసీ ఐపీఓ జీఎంపీ</p>
<p>ల్​ఐసీ ఐపీఓ జీఎంపీ</p> (HT)

LIC IPO GMP today | ఎల్​ఐసీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ ముగిసింది. షేర్ల అలాట్​మెంట్​ కుడా వచ్చేసింది. ఇక ఇప్పుడు అందరి చూపు.. దేశంలోనే అతిపెద్ద ఐపీఓ లిస్టింగ్​ డే(మే 17)పైనే. ఈ క్రమంలో ఎల్​ఐసీ ఐపీఓ జీఎంపీ(గ్రే మార్కెట్​ ప్రీమియం)కి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ జీఎంపీని చూస్తే.. మదుపర్లకు, ముఖ్యంగా షేర్లు అలాట్​ అయినవారికి ఆందోళనకర వార్త తప్పదు!

ఎల్​ఐసీ ఐపీఓ జీఎంపీ

శుక్రవారం.. ఎల్​ఐసీ ఐపీఓ జీఎంపీ మైనస్​ రూ. 25గా ఉంది. అంటే.. లిస్టింగ్​ డే రోజు.. షేర్లు రూ. 925(రూ. 949- రూ. 25) వద్ద లిస్ట్​ అవుతాయని అంచనా. ఇదే జరిగితే.. ప్రైజ్​ బ్యాండ్​(రూ. 902 రూ. 949) కన్నా 3శాతం తక్కువకు షేర్లు లిస్ట్​ అవుతున్నట్టు.

LIC IPO GMP | గురువారం.. ఎల్​ఐసీ ఐపీఓ జీఎంపీ మైనస్​ రూ. 26గా ఉండేది. కాగా.. ఐపీఓ సబ్​స్క్రిప్షన్​కు ఒక రోజు ముందు.. జీఎంపీ రూ. 92గా ఉంది. ప్రస్తుతం మైనస్​ రూ. 25తో పోల్చుకుంటే.. ఎల్​ఐసీ ఐపీఓ జీఎంపీ ఏకంగా 125శాతం పడినట్టు.

ఇదే జరిగితే.. ఐపీఓ అలాట్​ అయినవారికి నష్టాలు తప్పవు!

కారణం ఏంటి?

అంతర్జాతీయంగా స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ద్రవ్యోల్బణం, ఫెడ్​- ఆర్​బీఐ చర్యలతో మదుపర్లలో అనిశ్చితి నెలకొంది. ఎఫ్​ఐఐలు(ఫారిన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్​వెస్టర్లు) భారీగా విక్రయాలు చేపట్టారు. ఈ అంశాలు ఎల్​ఐసీ ఐపీఓకు సైతం ప్రతికూలంగా మారినట్టు కనిపిస్తోంది.

జీఎంపీ ఇదే విధంగా కొనసాగితే.. ఎల్​ఐసీ ఐపీఓ.. డిస్కౌంట్​లోనే లిస్ట్​ అయ్యే అవకాశాలు ఉంటాయి.

గ్రే మార్కెట్​ ప్రీమియం అంటే ఏంటి?

ఐపీఓకు వచ్చే కంపెనీల షేర్లు తొలుత గ్రే మార్క్​ట్​లో ట్రేడ్​ అవుతూ ఉంటాయి. దీని బట్టి.. ఐపీఓ లాభాల్లో లిస్ట్​ అవుతుందా? లేక నష్టాల్లో లిస్ట్​ అవుతుందా? అని మార్కెట్​ వర్గాలు అంచనాలు వేసుకుంటాయి. లిస్టింగ్​ లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేసే ట్రేడర్లు, పెట్టుబడిదారులు ఈ గ్రే మార్కెట్​ ప్రీమియంను ఫాలో అవుతూ ఉంటారు

LIC IPO allotment status | గతేడాది వచ్చిన ఐపీఓల్లో చాలా వరకు మంచి గ్రే మార్కెట్​ ప్రీమియంతో.. భారీ లాభాల్లో లిస్ట్​ అయ్యాయి. కానీ పేటీఎం వంటి సంస్థల గ్రే మార్కెట్ ప్రీమియం​ నష్టాల్లోనే ఉండగా.. లిస్టింగ్​ కూడా అదే విధంగా జరిగింది.

అయితే.. ఓ సంస్థ ఐపీఓకు అప్లై చేయాలా? వద్దా? అని ఆలోచించేందుకు.. గ్రే మార్కెట్​ ప్రీమియంను ప్రామాణికంగా చూడవద్దని మార్కెట్​ విశ్లేషకులు సూచిస్తూ ఉంటారు. కంపెనీ ఫండమెంటల్స్​, పీ అండ్​ ఎల్​ స్టేట్​మెంట్​, బ్యాలెన్స్​ షీట్​. వ్యాపారం వంటివి చూసి ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేయాలని చెబుతుంటారు.

సంబంధిత కథనం

టాపిక్