ఎల్​ఐసీ ఐపీఓకు లాభాలొస్తాయా? గ్రే మార్కెట్​ ప్రీమియం ఏం చెబుతోంది?-all you need to know about lic ipo and its grey market premium ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  All You Need To Know About Lic Ipo And Its Grey Market Premium

ఎల్​ఐసీ ఐపీఓకు లాభాలొస్తాయా? గ్రే మార్కెట్​ ప్రీమియం ఏం చెబుతోంది?

HT Telugu Desk HT Telugu
Apr 28, 2022 12:06 PM IST

ఎల్​ఐసీ ఐపీఓ వివరాలు వచ్చేశాయి. సబ్​స్క్రిప్షన్ల కోసం మదుపర్లు నగదును పోగుచేసుకుంటున్నారు. ఇంతకి ఎల్​ఐసీ ఐపీఓకు లాభాలొస్తాయా? లేక పేటిఎంలాగే ఎల్​ఐసీ షేర్ల లిస్టింగ్​ నష్టాల్లో జరుగుతుందా? గ్రే మార్కెట్​ ప్రీమియం ఏం సూచిస్తోంది?

ఎల్​ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం
ఎల్​ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం (HT telugu)

LIC IPO GMP | ఎల్​ఐసీ ఐపీఓకు సర్వం సిద్ధమైంది. మే 4- మే 9 మధ్యలో ఎల్​ఐసీ ఐపీఓను సబ్​స్క్రైబ్​ చేసుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు చెందిన వివరాలన్నీ బయటకు వచ్చేశాయి. ఇప్పుడు ఎల్​ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం(జీఎంపీ)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ వివరాలు..

ట్రెండింగ్ వార్తలు

ఎల్​ఐసీ ఐపీఓ వివరాలు..

  • ప్రైజ్​ బ్యాండ్​:- రూ. 902- రూ. 949
  • సబ్​స్క్రిప్షన్​ డేట్స్​:- మే 4- మే 9
  • పాలసీదారులకు డిస్కౌంట్​:- రూ. 60/షేరు(ఏప్రిల్​ 13కు ముందు పాలసీ తీసుకుని ఉండాలి)
  • ఎల్​ఐసీ ఉద్యోగులకు డిస్కౌంట్​:- రూ. 45/ షేరు
  • లిస్టింగ్​:- 2022 మే 17

గ్రే మార్కెట్​ ప్రీమియం..

LIC IPO grey market premium | ప్రైమరీ మార్కెట్​లో ఎల్​ఐసీ ఐపీఓ.. మే 17న లిస్ట్​ అవుతుంది. కాగా.. సోమవారమే సెంకడరీ మార్కెట్​లో ఎల్​ఐసీ షేర్లు ట్రేడింగ్​కు వచ్చాయి. రూ. 25 ప్రీమియంతో సోమవారం ఎల్​ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం ఉంది. కాగా.. అది బుధవారం రూ. 28కి చెరింది. కానీ.. గురువారం ఎల్​ఐసీ ఐపీఓ జీపీఎం రూ. 20కి పడింది.

దీని అర్థం ఏటంటే.. ఎల్​ఐసీ ఐపీఓ లిస్టింగ్​.. రూ. 969 వద్ద అవుతుందని గ్రే మార్కెట్​ అంచనా వేస్తోంది. ప్రైజ్​ బ్యాండ్​(రూ. 902-949) కన్నా ఇది 5శాతం అధికం.

ఐపీఓకు వచ్చే కంపెనీల షేర్లు తొలుత గ్రే మార్క్​ట్​లో ట్రేడ్​ అవుతూ ఉంటాయి. దీని బట్టి.. ఐపీఓ లాభాల్లో లిస్ట్​ అవుతుందా? లేక నష్టాల్లో లిస్ట్​ అవుతుందా? అని మార్కెట్​ వర్గాలు అంచనాలు వేసుకుంటాయి. లిస్టింగ్​ లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేసే ట్రేడర్లు, పెట్టుబడిదారులు ఈ గ్రే మార్కెట్​ ప్రీమియంను ఫాలో అవుతూ ఉంటారు.

గతేడాది వచ్చిన ఐపీఓల్లో చాలా వరకు మంచి గ్రే మార్కెట్​ ప్రీమియంతో.. భారీ లాభాల్లో లిస్ట్​ అయ్యాయి. కానీ పేటీఎం వంటి సంస్థల గ్రే మార్కెట్ ప్రీమియం​ నష్టాల్లోనే ఉండగా.. లిస్టింగ్​ కూడా అదే విధంగా జరిగింది.

గ్రే మార్కెట్​ ప్రిమియం వాల్యూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఐపీఓకు మంచి డిమాండ్​ లభిస్తే.. లిస్టింగ్​ లాభాలు ఉంటాయి. డిమాండ్​ లేకపోతే నష్టాల్లో లిస్ట్​ అయ్యే అవకాశం ఉంది.

అయితే.. ఓ సంస్థ ఐపీఓకు అప్లై చేయాలా? వద్దా? అని ఆలోచించేందుకు.. గ్రే మార్కెట్​ ప్రీమియంను ప్రామాణికంగా చూడవద్దని మార్కెట్​ విశ్లేషకులు సూచిస్తూ ఉంటారు. కంపెనీ ఫండమెంటల్స్​, పీ అండ్​ ఎల్​ స్టేట్​మెంట్​, బ్యాలెన్స్​ షీట్​. వ్యాపారం వంటివి చూసి ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేయాలని చెబుతుంటారు.

ఎల్​ఐసీ ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేయవచ్చా?

LIC IPO date | "ఇండియ బీమా రంగంలో ఎల్​ఐసీ అగ్రగామిగా వెలుగుతోంది. ఎల్​ఐసీ బ్రాండ్​ వాల్యూ చాలా పెద్దది. అదే సమయంలో ఎల్​ఐసీకి ప్రస్తుతం ప్రైవేటు ప్లేయర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. కొన్నేళ్లుగా.. ఎల్​ఐసీ మార్కెట్​ షేరు కూడా పడిపోతోంది. కానీ ఎల్​ఐసీ బిజినెస్​ మోడల్​ చాలా బాగుంది. ఇది మంచి ఫండమెంటల్స్​ ఉన్న సంస్థ. అందుకే దీర్ఘకాలం కోసం ఎల్​ఐసీ ఐపీఓకు అప్లై చేసుకోవడం మంచిది," అని స్వాస్తిక ఇన్​వెస్ట్​మార్ట్​లోని హెడ్​ ఆఫ్​ రిసెర్చ్​ సంతోష్​ మీనా వెల్లడించారు.

గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రం. దీనితో హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి బంధం లేదు. ఏదైనా ఐపీఓలో పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్​ను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్