ఈ రోజే ఎల్ఐసీ ఐపీఓ షేర్ అలాట్‌మెంట్..! షేర్ల అలాట్‌మెంట్‌ తెలుసుకోవ‌డం ఎలా..?-lic ipo share allotment likely today how to check the allotment status ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఈ రోజే ఎల్ఐసీ ఐపీఓ షేర్ అలాట్‌మెంట్..! షేర్ల అలాట్‌మెంట్‌ తెలుసుకోవ‌డం ఎలా..?

ఈ రోజే ఎల్ఐసీ ఐపీఓ షేర్ అలాట్‌మెంట్..! షేర్ల అలాట్‌మెంట్‌ తెలుసుకోవ‌డం ఎలా..?

HT Telugu Desk HT Telugu
May 12, 2022 05:25 PM IST

ఈ సంవ‌త్స‌రం మార్కెట్లోకి వ‌చ్చిన ఐపీఓల్లో జీవిత బీమా సంస్థ‌(ఎల్ఐసీ) ఐపీఓకు వ‌చ్చిన ప్ర‌చారం, డిమాండ్ మ‌రే ఐపీఓకు రాలేదు. భార‌త షేర్ మార్కెట్ చ‌రిత్ర‌లో అతిపెద్ద ఐపీఓగా ఇది చ‌రిత్ర సృష్టించింది. మే 9 సోమ‌వారంతో ఈ ఐపీఓ బిడ్డింగ్ గ‌డువు ముగిసింది. ఈ రోజు(మే 12) షేర్ అలాట్‌మెంట్ ఉన్న‌ట్లు స‌మాచారం.

<p>ప్ర‌తీకాత్మ‌క చిత్రం</p>
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

మే 12న ఎల్ఐసీ ఐపీఓ షేర్ అలాట్మెంట్ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ అలాట్‌మెంట్ కోసం ఇన్వెస్ట‌ర్లు ఎదురు చూస్తున్నారు. త‌మ‌కు అలాట్మెంట్ జ‌రిగిందా? లేదా? అన్న ఉత్కంఠ‌లో ఉన్నారు. ఎల్ఐసీ ఐపీఓ అలాట్మెంట్ వివ‌రాల‌ను రెండు విధాలుగా తెలుసుకోవ‌చ్చు.

బీఎస్ఈ(బాంబే స్టాక్ ఎక్సేంజ్‌) అధికారిక వెబ్‌సైట్ నుంచి..

బీఎస్ఈ(బాంబే స్టాక్ ఎక్సేంజ్‌) అధికారిక వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. ఇందుకు మొద‌ట

1) బీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యాలి.

2) `ఈక్విటీ` ఇష్యూ టైప్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

3) ఇష్యూ పేరును `లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్`గా సెలెక్ట్ చేయాలి.

4) మీరు ఐపీఓకు అప్లై చేసిన‌ప్పుడు జ‌న‌రేట్ అయిన అప్లికేష‌న్ నెంబ‌ర్‌ను కానీ, మీ పాన్ నెంబ‌ర్‌ను కానీ ఎంట‌ర్ చేయాలి.

5) `ఐ యామ్ నాట్ ఎ రోబో` అనే ప‌దం ప‌క్క‌నున్న చెక్ బాక్స్ ను క్లిక్ చేసి, స‌బ్మిట్ నొక్కాలి.

మీకు షేర్లు అలాట్ అయిందీ, లేనిదీ డిస్‌ప్లే లో వ‌స్తుంది. అలాట్ కాక‌పోతే, అదే విష‌యం స్ప‌ష్టం చేస్తుంది.

కేఫిన్ వెబ్‌సైట్ ద్వారా..

కేఫిన్‌(KFin Technologies Private Limited) ఆన్‌లైన్ పోర్ట‌ల్ (https://kcas.kfintech.com/ipostatus) ద్వారా కూడా ఎల్ఐసీ ఐపీఓ షేర్ అలాట్మెంట్ వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. ఈ సంస్థ ఈ ఐపీఓకు రిజిస్ట్రార్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. షేర్ల అలాట్‌మెంట్‌, ఆ షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ ఫార్మాట్‌లో అలాట్‌మెంట్ పొందిన వారి ఖాతాకు పంపించ‌డం, అలాట్‌మెంట్ పొంద‌ని ద‌ర‌ఖాస్తుదారుల‌కు డ‌బ్బులు రీఫండ్ చేయ‌డం, ఈ ఐపీఓకు సంబంధించి ఇన్వెస్ట‌ర్ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం మొద‌లైన ప‌నుల‌ను ఈ సంస్థ చేస్తుంది.

1) https://kcas.kfintech.com/ipostatus వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

2) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఐపీఓను సెలెక్ట్ చేసుకోవాలి

3) అప్లికేష‌న్ నెంబ‌ర్ కానీ, పాన్ కానీ, డీపీఐడీ కానీ, క్ల‌యింట్ ఐడీ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వివ‌రాల‌ను ఫిల్ చేయాలి.

4) క్యాప్చాను ఎంట‌ర్ చేసి, స‌బ్మిట్ నొక్కాలి.

5) మీకు షేర్లు అలాట్ అయిందీ, లేనిదీ డిస్‌ప్లే లో వ‌స్తుంది. అలాట్ కాక‌పోతే, అదే విష‌యం స్ప‌ష్టం చేస్తుంది.

అయితే, షేర్ల అలాట్‌మెంట్ పూర్త‌యిన‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డిన త‌రువాతే మీకు ఈ స‌మాచారం ల‌భిస్తుంది.

రేపు రీఫండ్‌

షేర్లు అలాట్ కానివారికి, వారి బ్యాంక్ ఖాతాల్లోకి మే 13న మ‌నీ రీఫండ్ అవుతుంది. అలాగే, షేర్లు అలాట్ అయిన‌వారికి, వారి డీమ్యాట్ అకౌంట్ల‌లోకి మే 16న షేర్లు క్రెడిట్ అవుతాయి. మే 17న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఎల్ఐసీ లిస్ట్ అవుతుంది. మొద‌ట అద్బుత‌మైన ప్ర‌చారం ల‌భించ‌డంతో గ్రే మార్కెట్లో(అన్‌లిస్టెడ్ మార్కెట్) ఎల్ఐసీ షేర్ దాదాపు రూ. 100 ప్రీమియంతో కొన‌సాగింది. అయితే, గ‌త ఐదు రోజులుగా షేర్ మార్కెట్ కుప్ప‌కూలుతుండ‌డంతో, గ్రే మార్కెట్లో ఎల్ఐసీ షేర్ వాల్యూ ప‌డిపోతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఇది సుమారు రూ. 95 డిస్కౌంట్‌తో ఉంది.

Whats_app_banner

టాపిక్