LIC IPO | ఐపీఓకు దూరంగా 'ఎఫ్​ఐఐలు'.. మదుపర్లకు నష్టాలు తప్పవా?-lic ipo fii s show less interest on india s biggest ipo ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lic Ipo | ఐపీఓకు దూరంగా 'ఎఫ్​ఐఐలు'.. మదుపర్లకు నష్టాలు తప్పవా?

LIC IPO | ఐపీఓకు దూరంగా 'ఎఫ్​ఐఐలు'.. మదుపర్లకు నష్టాలు తప్పవా?

Sharath Chitturi HT Telugu
May 09, 2022 04:19 PM IST

LIC IPO | ఎల్​ఐసీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ ముగిసింది! ఇక ఇప్పుడు లిస్టింగ్​ డేపైనే అందరి చూపు ఉంది. కాగా.. దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు ఎఫ్​ఐఐలు దూరంగా ఉండిపోయారు. ఇది లిస్టింగ్​పై ఏ విధంగా ప్రభావం చూపనుంది?

<p>ఎల్​ఐసీ ఐపీఓకు ఎఫ్​ఐఐలు దూరం!</p>
ఎల్​ఐసీ ఐపీఓకు ఎఫ్​ఐఐలు దూరం! (HT telugu)

LIC IPO news | స్టాక్​ మార్కెట్ల కదలికల్లో ఎఫ్​ఐఐ(ఫారిన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్​వెస్టర్)లది కీలక పాత్ర. ఇందుకు తాజా పరిణామాలో ఉదాహరణ. 8నెలలుగా.. ఎఫ్​ఐఐలు అమ్మకాలవైపు ఉండటంతో దేశీయ సూచీలు భారీగా పతనమవుతున్నాయి. అలాంటి కీలకమైన ఎఫ్​ఐఐలు.. ఎల్​ఐసీ ఐపీఓకు దూరంగా ఉండిపోయారు! మరి ఇప్పుడు ఐపీఓ పరిస్థితేంటి? నష్టాలు తప్పవా?

ఎఫ్​ఐఐలు 2శాతమే..!

దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు బలమైన యాంకర్​ బుక్​ లభించింది. కానీ అందులో కూడా డొమెస్టిక్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్​వెస్టర్లే ఎక్కువగా ఉన్నారు. ఇన్​స్టిట్యూషనల్​ బయ్యర్ల కోసం కేటాయించిన మొత్తంలో.. ఎఫ్​ఐఐలు కేవలం 2శాతం షేర్లకే ఆర్డర్లు ప్లేస్​ చేయడం గమనార్హం.

ఇందుకు కారణాలు చాలా ఉన్నాయని మార్కెట్​ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.

"అక్టోబర్​ నుంచి ఎఫ్​ఐఐలు భారీగా అమ్మేస్తున్నారు. ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, రుపాయి పతనంతో ఇండియాలో వారికున్న లాభాలు చెదిరిపోతాయని వారు భావిస్తున్నారు. అందుకే ఐపీఓపై వారు పెద్దగా ఆసక్తి చూపించలేదు," అని ప్రైమ్​ఇన్​వెస్టర్​.ఇన్​కు చెందిన విద్య బాలా వెల్లడించారు.

ఎల్​ఐసీ భవిష్యత్తుపై ఎఫ్​ఐఐలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.

"ఎల్​ఐసీ మార్కెట్​ షేరు కోసుకుపోతుందని పెట్టుబడిదారులు అనుమానిస్తున్నారు. కరోనా మహమ్మారితో ప్రైవేటు బిమా సంస్థలు తమ జోరును పెంచాయి. కాగా.. ప్రభుత్వ రంగ సంస్థలపై ఎఫ్​ఐఐలకు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. ప్రభుత్వం నడిపే ఆయా సంస్థల షేర్లతో డబ్బులు సంపాదించడం కష్టమని వారు భావిస్తుంటారు. అదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులను తమవైపు తిప్పుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి! ప్రభుత్వానికి కాకుండా.. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఎల్​ఐసీ నడుచుకుంటుందన్న నమ్మకాన్ని కలిగించలేకపోయింది," అని పైపర్​ సెరిక అడ్వైజర్​ లిమిటెడ్​కు చెందిన ఫండ్​ మేనేజర్​ అభయ్​ అగర్వాల్​ పేర్కొన్నారు.

కాగా.. ఏడాది కాలంలో ఎన్నో ఐపీఓలు మార్కెట్లోకి వచ్చాయి. వాటిల్లో చాలా సంస్థల కోసం ఎఫ్​ఐఐలు ఎగబడ్డారు. జొమాటోకు భారీగా, పేటీఎం ఐపీఓకు కాస్త ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఆ రెండు స్టాక్స్​.. లిస్టింగ్​తో పోల్చుకుంటే చాలా దారుణంగా పడిపోయాయి.

మరి ఈ పరిస్థితుల్లో ఎల్​ఐసీ ఐపీఓ లిస్టింగ్​ ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న మదుపర్లకు కలుగుతోంది.

ఎల్​ఐసీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్

LIC IPO subscription | ఎల్​ఐసీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ దాదాపు ముగింపునకు చేరింది. కొన్ని గంటల తర్వాత ఐపీఓను సబ్​స్క్రైబ్​ చేసుకోలేరు. ప్రస్తుత ఐపీఓ సబ్​స్క్సిప్షన్​ వివరాలను తెలుసుకుందాము.

  • క్యూఐబీ:- 2.22X
  • ఎన్​ఐఐ:- 2.12X
  • రిటైల్​:- 1.85X
  • ఉద్యోగులు:- 5.73X
  • పాలసీదారులు:- 2.55X

ఐపీఓ వివరాలు:-

  • LIC IPO details | ఐపీఓ సైజు:- రూ. 21వేల కోట్లు (దేశంలోనే అతిపెద్ద ఐపీఓ)
  • ఐపీఓ డేట్​:- మే 4- మే 9
  • ఐపీఓ ప్రైజ్​:- రూ. 902- రూ. 949/షేరు. కచ్చితంగా షేర్లు అలాట్​ అవ్వాలంటే.. అప్పర్​ బ్యాండ్​(రూ. 949)తో బిడ్లు వేయడం ఉత్తమం.
  • అప్లికేషన్​ లిమిట్​:- ఒక వ్యక్తి.. 14 ఐపీఓ బిడ్లను అప్లై చేసుకోవచ్చు.
  • పాలసీదారులకు డిస్కౌంట్​:- షేరు మీద రూ. 60
  • ఎల్​ఐసీ ఉద్యోగులకు డిస్కౌంట్​:- షేరు మీద రూ. 45
  • అలాట్​మెంట్​ డేట్:- మే 12
  • ఐపీఓ లిస్టింగ్​:- మే 17 (బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ)

ఎల్​ఐసీ ఐపీఓ జీఎంపీ:-

LIC IPO GMP | ఎల్​ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం.. ప్రస్తుతం రూ. 40గా ఉంది. గత వారం చివర్లో ఇది రూ. 60గా ఉండటం గమనార్హం.

ఐపీఓకు వచ్చే కంపెనీల షేర్లు తొలుత గ్రే మార్క్​ట్​లో ట్రేడ్​ అవుతూ ఉంటాయి. దీని బట్టి.. ఐపీఓ లాభాల్లో లిస్ట్​ అవుతుందా? లేక నష్టాల్లో లిస్ట్​ అవుతుందా? అని మార్కెట్​ వర్గాలు అంచనాలు వేసుకుంటాయి. లిస్టింగ్​ లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేసే ట్రేడర్లు, పెట్టుబడిదారులు ఈ గ్రే మార్కెట్​ ప్రీమియంను ఫాలో అవుతూ ఉంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్