LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ ఓపెన్- ఇన్వెస్ట్ చేసే ముందు ఈ వివరాలు తెలుసుకోండి
LIC IPO | ఎల్ఐసీ ఐపీఓ సబ్స్క్రిప్షన్.. ఇవాళ ఓపెన్ కానుంది. అప్లై చేసుకునే ముందు ఐపీఓ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
LIC IPO details | స్టాక్ మార్కెట్ వర్గాలతో పాటు దేశప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓ.. ఇవాళ సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానుంది. ఫలితంగా ఏడాది నిరీక్షణకు తెరపడనుంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఐపీఓ వివరాలతో పాటు, ప్రస్తుత గ్రే మార్కెట్ విశేషాలను ఓసారి చూద్దాం..
ఎల్ఐసీ ఐపీఓ వివరాలు..
- ఐపీఓ సైజు:- రూ. 21వేల కోట్లు (దేశంలోనే అతిపెద్ద ఐపీఓ)
- ఐపీఓ డేట్:- మే 4- మే 9
- ఐపీఓ ప్రైజ్:- రూ. 902- రూ. 949/షేరు. కచ్చితంగా షేర్లు అలాట్ అవ్వాలంటే.. అప్పర్ బ్యాండ్(రూ. 949)తో బిడ్లు వేయడం ఉత్తమం.
- అప్లికేషన్ లిమిట్:- ఒక వ్యక్తి.. 14 ఐపీఓ బిడ్లను అప్లై చేసుకోవచ్చు.
- పాలసీదారులకు డిస్కౌంట్:- షేరు మీద రూ. 60
- ఎల్ఐసీ ఉద్యోగులకు డిస్కౌంట్:- షేరు మీద రూ. 45
- అలాట్మెంట్ డేట్:- మే 12
- ఐపీఓ లిస్టింగ్:- మే 17 (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ)
యాంకర్ బుక్కు భారీ డిమాండ్
ఐపీఓకు ముందు.. ప్రభుత్వానికి గుడ్ న్యూస్ అందింది. ఎల్ఐసీ ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు యాంకర్ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు! మొత్తం మీద యాంకర్ ఇన్వెస్టర్ల నుంచే రూ. 5,620కోట్లు ఎల్ఐసీకి దక్కాయి.
హై ప్రొఫైల్‌తో కూడిన ఇన్ట్సిట్యూషనల్ ఇన్వెస్టర్లను యాంకర్ ఇన్వెస్టర్లు అని అంటారు. కాగా.. ఇతర ఇన్వెస్టర్లులాగా కాకుండా.. వీరికి లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే.. లిస్టింగ్ అయిన కొన్ని రోజుల వరకు.. వీరు తమ స్టాక్స్‌ను అమ్ముకోలేరు. సాధారణంగా.. ఏ ఐపీఓకైనా.. రిటైలర్ల సబ్‌స్క్రిషన్‌కు కొన్ని రోజుల ముందు.. యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయిస్తారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందనతో ఐపీఓకు ఉన్న డిమాండ్‌ను మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూ ఉంటాయి.
ఎల్ఐసీ ఐపీఓ, సంస్థ పనితీరుపై ఎఫ్ఐఐల్లో ఆందోళన నెలకొంది. కాగా.. ప్రపంచంలోని పెన్షన్ ఫండ్స్ మాత్రం ఐపీఓపై ఆసక్తి చూపించినట్టు స్పష్టమవుతోంది.
సంబంధిత కథనం
టాపిక్