LIC IPO | ఆ ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్.. ఎల్ఐసీ ఐపీఓ సక్సెస్..!
ఎల్ఐసీ ఐపీఓ కోసం యాంకర్ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు! యాంకర్ బుక్ రెండింతల డిమాండ్‌తో ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయినట్టు సమాచారం. ఈ వారంలో ఐపీఓ ఓపెన్ కానున్న వేళ.. ఈ వార్తతో ప్రభుత్వానికి గుడ్ న్యూస్ అందినట్టే.
LIC IPO anchor investors list | స్టాక్ మార్కెట్ వర్గాలతో పాటు దేశ ప్రజలు ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓ.. మరో రెండు రోజుల్లో సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానుంది. దినికి ముందు.. ఎల్ఐసీలో 100శాతం వాటా కలిగిన ప్రభుత్వానికి గుడ్ న్యూస్ అందింది! ఎల్ఐసీ ఐపీఓకు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ లభించినట్టు తెలుస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన కోటా.. ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యిందని సమాచారం. మొత్తం మీద యాంకర్ ఇన్వెస్టర్లకు 732మిలియన్ షేర్లను రిజర్వ్ చేయగా.. రెండింత డిమాండ్ లభించినట్టు బ్యాంకింగ్ వర్గానికి చెందిన కొందరు వెల్లడించారు.
హై ప్రొఫైల్‌తో కూడిన ఇన్ట్సిట్యూషనల్ ఇన్వెస్టర్లను యాంకర్ ఇన్వెస్టర్లు అని అంటారు. కాగా.. ఇతర ఇన్వెస్టర్లులాగా కాకుండా.. వీరికి లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే.. లిస్టింగ్ అయిన కొన్ని రోజుల వరకు.. వీరు తమ స్టాక్స్‌ను అమ్ముకోలేరు. సాధారణంగా.. ఏ ఐపీఓకైనా.. రిటైలర్ల సబ్‌స్క్రిషన్‌కు కొన్ని రోజుల ముందు.. యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయిస్తారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందనతో ఐపీఓకు ఉన్న డిమాండ్‌ను మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూ ఉంటాయి.
యాంకర్ బుక్‌లో బడా కంపెనీల పేర్లే ఉన్నట్టు తెలుస్తోంది. నార్వేకు చెందిన నోర్గెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్- జీఐసీ వంటి పేర్లు నమోదైనట్టు సమాచారం. అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయంగా ఉన్న హెచ్డీఎఫ్సీ మూచ్యువల్ ఫండ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, కొటాక్ సైతం యాంకర్ ఇన్వెస్టర్స్‌గా ఉన్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం మీద యాంకర్ బుక్‌లో 20 ఇన్వెస్టర్ల పేర్లు ఉన్నట్టు వెల్లడించాయి.
ఎల్ఐసీ ఐపీఓ, సంస్థ పనితీరుపై ఎఫ్ఐఐల్లో ఆందోళన నెలకొంది. కాగా.. ప్రపంచంలోని పెన్షన్ ఫండ్స్ మాత్రం ఐపీఓపై ఆసక్తి చూపించినట్టు స్పష్టమవుతోంది.
గ్రే మార్కెట్ ప్రీమియం..
LIC IPO GMP | ప్రస్తుతం ఎల్ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం.. రూ. 75గా ఉంది. గత గురువారం రూ. 20గా ఉన్న ఎల్ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం.. శుక్రవారానికి రూ .72కు చేరింది. ఇక శనివారం ఎల్ఐసీ జీఎంపీ రూ. 92కు పెరిగింది.
ఐపీఓకు వచ్చే కంపెనీల షేర్లు తొలుత గ్రే మార్క్ట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. దీని బట్టి.. ఐపీఓ లాభాల్లో లిస్ట్ అవుతుందా? లేక నష్టాల్లో లిస్ట్ అవుతుందా? అని మార్కెట్ వర్గాలు అంచనాలు వేసుకుంటాయి. లిస్టింగ్ లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ట్రేడర్లు, పెట్టుబడిదారులు ఈ గ్రే మార్కెట్ ప్రీమియంను ఫాలో అవుతూ ఉంటారు.
ఎల్ఐసీ ఐపీఓ వివరాలు..
- LIC IPO details | ప్రైజ్ బ్యాండ్:- రూ. 902- రూ. 949
- సబ్స్క్రిప్షన్ డేట్స్:- మే 4- మే 9
- పాలసీదారులకు డిస్కౌంట్:- రూ. 60/షేరు(ఏప్రిల్ 13కు ముందు పాలసీ తీసుకుని ఉండాలి)
- ఎల్ఐసీ ఉద్యోగులకు డిస్కౌంట్:- రూ. 45/ షేరు
- లిస్టింగ్:- 2022 మే 17
ఈ ఐపీఓతో ప్రభుత్వం.. 3.5శాతం వాటాను విక్రయించి రూ. 21వేల కోట్లను సమీకరించాలని సంకల్పించింది.
సంబంధిత కథనం
టాపిక్