G20 summit: ‘జీ 20 విందుకు కాంగ్రెస్ నేత ఖర్గేను ఆహ్వానించరా?’.. రాహుల్ గాంధీ సీరియస్
G20 summit: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సదస్సు సందర్భంగా అతిథుల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్నవిందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేకు ఆహ్వానం పంపించకపోవడం పై కాంగ్రెస్ మండిపడుతోంది.
G20 summit: జీ 20 సదస్సు సందర్భంగా అతిథుల గౌరవార్థం శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్నవిందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేకు ఆహ్వానం పంపించలేదన్న వార్తలు ఇప్పుడు సంచలనం గా మారాయి. ప్రభుత్వ అహంకార ధోరణికి ఇది ఉదాహరణ అని కాంగ్రెస్ మండిపడుతోంది.
అంత అహంకారమా?
జీ 20 సదస్సు సందర్భంగా అతిథుల గౌరవార్థం శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్నవిందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేకు ఆహ్వానం పంపించకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో విపక్ష నాయకుడిగా ఉన్న మల్లిఖార్జున్ ఖర్గేకు ఆహ్వానం పంపించకపోవడమంటే, దేశంలోని 60% జనాభాను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఇది మోదీ సర్కారు అహంకారాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ మూడు యూరోప్ దేశాల పర్యటనలో ఉన్నారు. బ్రసెల్స్ లో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యతిరేకించినందుకేనా?
జీ 20 సదస్సు సందర్భంగా అతిథుల గౌరవార్థం శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్నవిందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ అని కాకుండా ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’ అని ఉండడంపై దేశవ్యాప్తంగా దేశం పేరు మార్పుపై చర్చ ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశం పేరును అధికారికంగా భారత్ గా మార్చనున్నారనే వార్తల నేపథ్యంలో, విపక్ష కూటమి ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తమ కూటమి పేరును ‘ఇండియా’ అని పెట్టుకున్నందువల్ల, మోదీ ప్రభుత్వం భయపడి పోయి దేశం పేరు నుంచి ఇండియా ను తొలగిస్తోందని ఆరోపించింది. ఈ ఆరోపణల కారణంగానే జీ 20 సదస్సు సందర్భంగా అతిథుల గౌరవార్థం శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్నవిందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేకు ఆహ్వానం పంపలేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
యూరోప్ టూర్
యూరోప్ దేశాల పర్యటనలో రాహుల్ గాంధీ ఆయా దేశాల నాయకులతో, పార్లమెంటేరియన్లతో చర్చలు జరపనున్నారు. బ్రసెల్స్ లో గురువారం పలువుర యూరోపియన్ పార్లమెంటు సభ్యులతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం, ఆయన ఫ్రాన్స్ కు, నార్వేకు వెళ్లనున్నారు. కాగా, శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్నవిందుకు వివిధ రాష్ట్రాల సీఎంలతో పాటు.. విపక్ష కూటమి ‘ఇండియా’ లో కీలకంగా వ్యవహరిస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ లకు కూడా ఆహ్వానం అందింది.