G20 summit in India : జీ20 సదస్సు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..!-all you need to know about g20 summit in india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  G20 Summit In India : జీ20 సదస్సు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..!

G20 summit in India : జీ20 సదస్సు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..!

Sharath Chitturi HT Telugu
Sep 08, 2023 11:39 AM IST

G20 summit in India : జీ20 సదస్సుకు దిల్లీ సిద్ధమైంది. దేశాధినేతల రాక మొదలైంది. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జీ20 సదస్సు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..!
జీ20 సదస్సు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..! (Hindustan Times)

G20 summit in India : శని, ఆదివారాలు జరగనున్న జీ20 సదస్సుకు దేశ రాజధాని దిల్లీ సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతాపరమైన నిబంధనలు గురువారం రాత్రి నుంచే ఒక్కొక్కటిగా అమల్లోకి వస్తున్నాయి. దేశాధినేతలు కూడా ఒక్కొక్కరుగా దిల్లీలో అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు జీ20 సమిట్​ అంటే ఏంటి? ఇండియాలో జరుగుతున్న ఈ సదస్సు ఎందుకు కీలకంగా మారనుంది? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

జీ20 సదస్సు అంటే ఏంటి?

జీ20 అంటే 'గ్రూప్​ ఆఫ్​ 20'. ఇందులో 19 దేశాలతో పాటు యూరోపియన్​ యూనియన్​ కలిసి ఉంటుంది. 1999లో ఈ జీ20ని స్థాపించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధంగా ప్రణాళికలు రచించేందుకు ఇది వేదికగా మారింది. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను జీ20 వేదికగా దేశాధినేతలు చర్చించి, పరిష్కారాలను కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

G20 summit 2023 : అయితే ప్రస్తుతం ఈ జీ20 సదస్సు గ్లోబల్​ ఎకానమీపైనే దృష్టి సారించడం లేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ.. ఆర్థిక వ్యవస్థతో పాటు ట్రేడింగ్​, సుస్థిరాభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఎనర్జీ, పర్యావరణం, వాతావరణ మార్పులు వంటి అంశాలు కూడా ఈ సమావేశాల్లో చర్చకు వస్తున్నాయి.

ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్​, కెనడా, చైనా, ఫ్రాన్స్​, జర్మనీ, ఇండియా, ఇండోనేషియల్​, ఇటలీ, జపాన్​, రిపబ్లిక్​ ఆఫ్​ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్​ ఆఫ్రికా, టర్కీ, యూకే, అమెరికాతో పాటు యూరోపియన్​ యూనియన్​ వంటి దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అంటే.. 85శాతం ప్రపంచ జీడీపీ, 75శాతం గ్లోబల్​ ట్రేడ్​, మూడింట రెండో వంతు ప్రపంచ జనాభాకు ఈ జీ20 సదస్సు ప్రాతినిథ్యం వహిస్తుంది.

ఇదీ చూడండి:- G20 Summit in Delhi : జీ20 సదస్సుకు దిల్లీ సిద్ధం- ఏవి మూతపడతాయి? ఏవి ఓపెన్​గా ఉంటాయి?

జీ20 లక్ష్యాలు..

G20 summit 2023 Delhi : 1999లో వచ్చిన ఆర్థిక సంక్షోభంతో ఆసియా దేశాలు విలవిలలాడిపోయాయి. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు లేదా నివారించేందుకు.. వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్​ బ్యాంక్​లు ఒక్క చోట చేరి సమాలోచనలు చేసేందుకు ఏర్పాటు చేసిందే ఈ జీ20.

అయితే ఈ జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే బాధ్యతలు ప్రతిసారి మారుతూ ఉంటాయి. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. 20 దేశాలు 5 గ్రూపులుగా విడిపోయి ఉంటాయి. ఈ గ్రూప్​ల మధ్య అధ్యక్షత బాధ్యతలు తిరుగుతూ ఉంటాయి. ఈసారి.. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు బాధ్యత వహించే అవకాశం ఇండియాకు దక్కింది. 2022 డిసెంబర్​ 1 నుంచి 2023 నవంబర్​ 30 వరకు ఈ బాధ్యతలు ఇండియా వద్దే ఉంటాయి. ఆ తర్వాత బ్రెజిల్​ చేతుల్లోకి వెళతాయి.

జీ20 సదస్సు అధ్యక్షత వహించే దేశం.. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన అజెండాను రూపొందిస్తుంది. సమిట్​కు హోస్ట్​ చేస్తుంది. ఈసారి 9-10 తేదీల్లో జరగనున్న సదస్సు హైలైట్​గా మారినప్పటికీ.. వివిధ అంశాలపై ఏడాది పొడవునా సమావేశాలు జరుగుతూనే ఉంటాయి.

2023 జీ20 సదస్సు లక్ష్యాలు ఇవే..

What is G20 summit : జీ20 సమిట్​లో ప్రధాన లక్ష్యం.. దేశాల ఆర్థిక వ్యవస్థను బలపరచడమే. దీనితో పాటు మరికొన్ని అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

  • గ్రీన్​ గ్రోత్​ వృద్ధి, వాతావరణ మార్పులపై పోరాటానికి ఆర్థిక సాయం, క్వాలిటీ ఆఫ్​ లైఫ్​.
  • వేగవంతమైన, అందరిని కలుపుకుని వెళ్లే, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం, విస్తరించడం ప్రోత్సహించడం.
  • ఎస్​డీజీ (సుస్థిరాభివృద్ధి లక్ష్యాల) పురోగతిని పరిశీలించడం
  • యూఎన్​, ఐఎంఎఫ్​, వరల్డ్​ బ్యాంక్​ వంటి మల్టీలాటరల్​ ఆర్గనైజేషన్స్​ని 21వ శతాబ్దానికి తగ్గట్టు సంస్కరించడం.
  • మహిళా నాయకత్వంలో అభివృద్ధిని సాధించడం.

వీరు రావట్లేదు..!

G20 summit 2023 date : ఈ దఫా జీ20 సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ రావట్లేదు. వీరి తరఫున ఆయా దేశాలకు చెందిన ఇతర అధికారులు ఇండియాకు వస్తున్నాయి. ఇక చివరి నిమిషంలో కొవిడ్​ పాజిటివ్​ తేలడంతో.. స్పెయిన్​ అధ్యక్షుడు పెడ్రో సాన్​చెజ్​ కూడా ఇండియాకు రావట్లేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం