JEE Main 2024 Session 2: జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను విడుదల చేసిన ఎన్టీఏ; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..-jee main 2024 session 2 nta releases admit cards guidelines details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main 2024 Session 2: జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను విడుదల చేసిన ఎన్టీఏ; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

JEE Main 2024 Session 2: జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను విడుదల చేసిన ఎన్టీఏ; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Apr 03, 2024 07:06 PM IST

JEE Main 2024 Session 2: జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవి ఏప్రిల్ 12వ తేదీ వరకు జరుగుతాయి. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో పరీక్ష రాయనున్న అభ్యర్థుల అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

JEE Main 2024 Session 2: ఏప్రిల్ 4, ఏప్రిల్ 5, ఏప్రిల్ 6 తేదీల్లో జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) బుధవారం విడుదల చేసింది. ఈ అడ్మిట్ కార్డులను ఆయా తేదీల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.ac.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 12 వరకు..

జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 (JEE Main 2024 Session 2) పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు జరుగుతాయి. ఏప్రిల్ 4, ఏప్రిల్ 5, ఏప్రిల్ 6 తేదీల్లో జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు jeemain.nta.ac.in వెబ్ సైట్ లో తమ అప్లికేషన్ నంబర్, డేటాఫ్ బర్త్ ను ఎంటర్ చేసి తమ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవచ్చు. అభ్యర్థులు డౌన్లోడ్ చేసేటప్పుడు అడ్మిట్ కార్డులో బార్ కోడ్ సరిగ్గా ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి. మిగతా తేదీల్లో ఈ పరీక్ష రాస్తున్న విద్యార్థుల అడ్మిట్ కార్డులను త్వరలో విడుదల చేయనున్నారు.

రెండు షిఫ్ట్ ల్లో..

ఎన్టీఏ నోటిఫికేషన్ ప్రకారం జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షను రోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు తమ జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఐడీని తీసుకురావడం తప్పనిసరి.

అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ఎలా

  • జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్ jeemain.nta.ac.in ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సెషన్-2 లింక్ కోసం జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2024పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు తమ వివరాలను నింపాల్సిన కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • వివరాలు నింపి, సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోవాలి.
  • జేఈఈ మెయిన్స్ - 2024 సెషన్ 2 (ఏప్రిల్ 2024) అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడంలో ఎవరికైనా ఇబ్బంది ఎదురైతే 011-40759000 నంబర్ కు కాల్ చేయవచ్చు. లేదా jeemain@nta.ac.in ఐడీకి ఈ-మెయిల్ చేయవచ్చు.

పరీక్ష రోజు మార్గదర్శకాలు

  • పరీక్ష కేంద్రానికి కనీసం 30 నిమిషాల ముందు అభ్యర్థులు హాజరుకావాలి.
  • వెరిఫికేషన్ కోసం మీ అడ్మిట్ కార్డు తో పాటు, ఇటీవలి ఫోటో, ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఐడీని తీసుకురండి.
  • అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు, స్టడీ మెటీరియల్, అనధికారిక వస్తువులను తీసుకెళ్లవద్దని కోరారు.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ టాబ్లెట్లు, పండ్లు, క్లియర్ వాటర్ బాటిళ్లు తెచ్చుకోవచ్చు. చాక్లెట్లు లేదా శాండ్ విచ్ ల వంటి ప్యాక్ చేసిన ఆహారాలకు అనుమతి లేదు.
  • పరీక్ష సమయంలో టోపీలు, మఫ్లర్లను అనుమతించరు.
  • విద్యార్థులు ఉంగరాలు, బ్రాస్ లెట్ లు, నెక్లెస్ లు వంటి ఆభరణాలు ధరించవద్దు.
  • సన్ గ్లాసెస్ కు కూడా అనుమతి లేదు.

Whats_app_banner