Sharad Pawar : ‘అదానీని టార్గెట్ చేశారు.. దర్యాప్తు అనవసరం’- కాంగ్రెస్‌కు శరద్ పవార్ షాక్!
Sharad Pawar on Adani : అదానీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఇవి విపక్షాలకు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.
Sharad Pawar on Adani : కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలకు షాకిస్తూ.. అదానీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. అదానీని టార్గెట్ చేసినట్టు అనిపిస్తోందని, హిన్డెన్బర్గ్ నివేదిక ఆధారంగా.. అదానీ కంపెనీలపై విపక్షాలు కోరుతున్నట్టు జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) దర్యాప్తు అనవసరం అని అన్నారు.
‘అదానీని టార్గెట్ చేశారు’
ఓ జాతీయ మీడియాకు ఇటీవలే ఇంటర్వ్యూ ఇచ్చారు శరద్ పవార్. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన హిన్డెన్బర్గ్- అదానీ వ్యవహారంపై ఈ మేరకు వ్యాఖ్యానించారు పవార్.
Sharad Pawar NDTV : "ఎవరో ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అది దేశంలో గందరగోళానికి దారితీసింది. ఇలాంటి స్టేట్మెంట్స్ ముందు కూడా వచ్చాయి. కానీ ఇలాంటి వాటికి ఈసారి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అసలు ఈ నివేదికను ఎవరు లేవనెత్తారు? అని ఆలోచించాలి. నివేదిక వెనుక ఎవరున్నారో మనకి తెలియదు. వారి బాక్గ్రౌండ్ ఏంటి? అన్నది తెలియదు. ఇలాంటివి బయటకొస్తే ఆందోళనలు మొదలవుతాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ విషయాలను మనం పట్టించుకోకుండా ఉండలేము. అదానీని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది," అని శరద్ పవార్ అన్నారు.
అదానీ గ్రూప్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని, ఆ సంస్థ స్టాక్ మేన్యుప్యులేషన్కు పాల్పడుతోందని ఈ ఏడాది జనవరిలో ఓ నివేదికను విడుదల చేసింది హిన్డెన్బర్గ్ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అదానీ సంస్థల విలువ, స్టాక్స్ ధరలు అమాతం పడిపోయాయి. మరోవైపు ఈ వ్యవహారంపై పార్లమెంట్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి విపక్షాలు. ముఖ్యంగా.. అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో.. విపక్షంలోని కీలక నేతల్లో ఒకరైన శరద్ పవార్ ఈ విధంగా స్పందించడం గమనార్హం.
‘దర్యాప్తు ఎందుకు అవసరం లేదంటే..’
Adani Hindenburg issue : అయితే.. తన మాటలకు క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు ఎన్సీపీ అధినేత. అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీ పరిశీలిస్తున్న నేపథ్యంలో జేపీసీ దర్యాప్తు అవసరం లేదన్నారు.
"ఈరోజున పార్లమెంట్లో మెజారిటీ ఎవరికి ఉంది? అధికారపక్షానికే కదా. ఈ వ్యవహారం రూలింగ్ పార్టికి వ్యతిరేకంగా ఉంది. జేపీసీలో అధికారపక్షానికి చెందిన నేతలో ఎక్కువగా ఉంటారు. మరి అలాంటప్పుడు నిజం ఎలా బయటకొస్తుంది? అందుకే జేపీసీ అవసరం లేదనిపిస్తోంది. అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఆ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. అక్కడ నిజయం బయటపడేందుకు అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి," అని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు.
Congress Adani news : హిన్డెన్బర్గ్- అదానీ వ్యవహారంపై గత నెలలో సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్యానెల్.. మరో నెల రోజుల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంది.
సంబంధిత కథనం