IRCTC Chennai To Kashmir : భూతలస్వర్గం కశ్మీర్ చూసొద్దామా?- చెన్నై నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
IRCTC Chennai To Kashmir : భూతల స్వర్గం కశ్మీర్ అందాలు చూసేందుకు ఐఆర్సీటీసీ చెన్నై నుంచి 12 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ లో గుల్‌మార్గ్, పహల్గామ్, శ్రీనగర్, సోనామార్గ్ వీక్షించవచ్చు. అక్టోబర్ 19న తదుపరి టూర్ స్టార్ట్ అవుతుంది.
IRCTC Chennai To Kashmir : కశ్మీర్ అందాలను వీక్షించేందుకు ఐఆర్సీటీసీ చార్టర్ కోచ్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. చెన్నై నుంచి 12 రోజుల కశ్మీర్ చార్టర్ కోచ్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ లో గుల్‌మార్గ్, పహల్గామ్, శ్రీనగర్, సోన్‌మార్గ్ వీక్షించవచ్చు. అక్టోబర్ 19న తదుపరి టూర్ స్టార్ట్ అవుతుంది.
కశ్మీర్ ను భూమిపై ఉన్న స్వర్గంగా చెబుతుంటారు. కశ్మీర్ అందాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ స్వర్గాన్ని సందర్శించాలని ప్రకృతి ప్రేమికులు కలలు కంటారు. ఐకానిక్ హౌస్‌బోట్‌లు, వసంతకాలంలో రంగురంగుల తులిప్ పువ్వులు, అద్భుతమైన మంచు పర్వతాలు ఇలా చెబుతూ పోతే జాబితా పెద్దగానే ఉంటుంది. కశ్మీర్ పై శక్తివంతమైన హిమాలయ పర్వత శ్రేణి ఉంది. ఇక్కడ మీరు అద్భుతమైన పర్వతాలు, అసాధారణమైన సరస్సులను చూడవచ్చు.
సోనామార్గ్ అంటే 'బంగారు పచ్చికభూమి' అని అర్థం. మంచుతో కప్పబడిన పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తుంటాయి. పర్వతాల మధ్య మెలికలు తిరుగుతూ సింధు నది ప్రవహిస్తుంది. ఏప్రిల్ చివరిలో సోనామార్గ్ రోడ్డు రవాణా కోసం తెరిచినప్పుడు, సందర్శకులు తెల్లటి తివాచీలాంటి మంచును చూడవచ్చు.
పహల్గామ్ జమ్ము-కశ్మీర్ రాష్ట్రంలోని హెల్త్ రిసార్ట్‌లలో ఒకటి. ఇది అనంతనాగ్ జిల్లాకు ఈశాన్యంలో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ తో కప్పబడిన ఎత్తైన కొండల మధ్య ఉంది. ఇక్కడ చల్లని ఉత్తేజకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, లిద్దర్ నల్లా ప్రవాహం దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర అమర్ నాథ్ గుహకు వెళ్లే మార్గంలో ఇది ఒక ముఖ్యమైన రవాణా శిబిరం.
గుల్మార్గ్ అంటే "మిడో ఆఫ్ ఫ్లవర్స్" అని అర్థం. గుల్మార్గ్ శ్రీనగర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కారులో గంటన్నర ప్రయాణం. గుల్మార్గ్ బ్యాక్ డ్రాప్‌లో హిమాలయ పర్వతాల సుందరమైన అందంతో పర్యాటకులను ఆకర్షించింది. గుల్‌మార్గ్‌లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి గుల్‌మార్గ్ గొండోలా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్. కేబుల్ కార్ పర్యాటకులను 8530 అడుగుల ఎత్తులో కొంగ్డోరి స్టేషన్‌కు తీసుకెళ్తుంది. గొండోలా సెకండ్ ఫేజ్ లో 12293 అడుగుల ఎత్తు వరకు వెళ్తారు. పర్యాటకులు గుర్రపు స్వారీని ఆస్వాదించవచ్చు. అద్భుతమైన "స్ట్రాబెర్రీ వ్యాలీ"లో స్వారీ చేయవచ్చు. చిరుతపులుల లోయ, అల్-పత్తర్ గడ్డకట్టిన సరస్సును చూడటానికి "కొంగ్డోరి" వరకు ప్రయాణించాలి. శీతాకాలంలో గుల్మార్గ్ ఒక అద్భుతమైన అనుభవం. ఇది పూర్తిగా మంచుతో కప్పబడిన తెల్లటి దుప్పటితో కప్పబడి స్కీయర్స్ స్వర్గధామంగా మారుతుంది.
ఒక్కొక్కరికి ఖర్చు : -
క్లాస్ | సింగిల్ఆక్యుపెన్సీ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్ | చైల్డ్ వితవుట్ బెడ్ |
కంఫర్ట్ | రూ. 40630/- | రూ. 36410/- | రూ. 35040/- | రూ. 26350/- | రూ. 21380/- |
సర్క్యూట్ : చెన్నై సెంట్రల్ -Mtyr సి తుషార్ ఎం (ఉధంపూర్)-శ్రీనగర్-గుల్మార్గ్-సోన్మార్గ్-పహల్గామ్-శ్రీనగర్- Mtyr సి తుషార్ ఎం (ఉధంపూర్)- చెన్నై సెంట్రల్.
కశ్మీర్ టూర్ పర్యటన వివరాలు
- డే 1 : అండమాన్ ఎక్స్‌ప్రెస్(రైలు నెం- 16031) ద్వారా చెన్నై నుంచి ఉదయం 05.00 గంటలకు రైలు బయలుదేరుతుంది
- డే 2 : రైలు ప్రయాణం
- డే 3 : Mtyr సి తుషార్ ఎం (ఉధంపూర్) కు ఉదయం 9 గంటలకు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో శ్రీనగర్‌కు వెళ్తారు. శ్రీనగర్‌కు చేరుకున్నాక హోటల్‌కు చెక్ ఇన్ చేస్తారు. శ్రీనగర్‌లో ఓవర్‌నైట్ బస చేస్తారు.
- డే 4 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత, మొఘల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్, దాల్ లేక్ బోటింగ్ సందర్శిస్తారు. శ్రీనగర్‌లో డిన్నర్, ఓవర్‌నైట్ స్టే చేస్తారు.
- డే 5 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత, గుల్మార్గ్ కు వెళ్తారు. స్నో పాయింట్ లెవల్-1ని సందర్శించి, తిరిగి శ్రీనగర్‌కు వెళ్లారు. శ్రీనగర్‌లో డిన్నర్ ఓవర్‌నైట్ స్టే ఉంటుంది.
- డే 6 : సోనామార్గ్ వ్యాలీని సందర్శించి, శ్రీనగర్‌కు తిరిగి వెళ్తారు. శ్రీనగర్‌లో రాత్రి బస చేస్తారు.
- డే 7 : పహల్గామ్ కు వెళ్తారు. బైసరన్ లోయ, దబ్యాన్ వ్యాలీని సందర్శించి, తిరిగి శ్రీనగర్‌కి తిరిగి చేరుకుంటారు. శ్రీనగర్‌లో రాత్రి బస చేస్తారు.
- డే 8 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత శంకరాచార్య ఆలయాన్ని సందర్శిస్తారు. సొంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. శ్రీనగర్‌లో రాత్రి భోజనం, బస చేస్తారు.
- డే 9 : Mtyr సి తుషార్ ఎం (ఉధంపూర్) కు ఉదయం 09.00 గంటలకు చేరుకుంటారు. అండమాన్ ఎక్స్‌ప్రెస్(రైలు నం. 16032) రాత్రి 11.00 గంటలు బోర్డింగ్ ఉంటుంది.
- డే 10, డే 11 : రైలు ప్రయాణం
- డే 12 : చెన్నై సెంట్రల్ కు రైలు చేరుకుంటుంది.
చెన్నై నుంచి కశ్మీర్ చార్టర్ కోచ్ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలను కింద లింక్ లో తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం