WhatsApp group: వాట్సప్ లో ‘హిందూ ఆఫీసర్స్ గ్రూప్’ ను క్రియేట్ చేసిన ఐఏఎస్ అధికారి సస్పెన్షన్-intended to foment division kerala ias officer suspended over whatsapp group ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Whatsapp Group: వాట్సప్ లో ‘హిందూ ఆఫీసర్స్ గ్రూప్’ ను క్రియేట్ చేసిన ఐఏఎస్ అధికారి సస్పెన్షన్

WhatsApp group: వాట్సప్ లో ‘హిందూ ఆఫీసర్స్ గ్రూప్’ ను క్రియేట్ చేసిన ఐఏఎస్ అధికారి సస్పెన్షన్

Sudarshan V HT Telugu
Nov 12, 2024 02:13 PM IST

వాట్సప్ లో హిందూ అధికారుల గ్రూప్ ను క్రియేట్ చేసిన ఐఏఎస్ అధికారిని కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సమాజంలో విబేధాలు, విద్వేషం రగిలించే ఉద్దేశంతో ఆ గ్రూప్ ను సృష్టించారని ఆరోపించింది. అయితే, సైబర్ నేరగాళ్లు తన మొబైల్ ఫోన్ ను హ్యాక్ చేసి, వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేశారని ఆ అధికారి చెబుతున్నారు.

వాట్సప్ లో మల్లు హిందూ ఆఫీసర్స్ గ్రూప్ ను క్రియేట్ చేసిన కేరళ ఐఏఎస్ అదికారి గోపాల కృష్ణన్
వాట్సప్ లో మల్లు హిందూ ఆఫీసర్స్ గ్రూప్ ను క్రియేట్ చేసిన కేరళ ఐఏఎస్ అదికారి గోపాల కృష్ణన్

Kerala IAS officer: ‘‘మల్లు హిందూ ఆఫీసర్స్’’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన ఐఏఎస్ అధికారి కె.గోపాలకృష్ణన్ ను కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.క అయితే, ఆ గ్రూప్ ను క్రియేట్ చేసింది తాను కాదని, తన ఫోన్ హ్యాక్ అయిందని, ఆ సైబర్ క్రిమినల్స్ తన ఫోన్ నుంచి ఈ గ్రూప్ ను క్రియేట్ చేశారని ఆ ఐఏఎస్ అధికారి వాదించారు. కానీ, ఆ వాదనను పోలీసులు తోసిపుచ్చడంతో ఈ చర్య తీసుకున్నారు.

విభజించే ఉద్దేశంతో..

సమాజంలో విభజనను రెచ్చగొట్టడానికి, అనైక్యతను నాటడానికి, రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల్లో సంఘీభావాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ వాట్సాప్ గ్రూప్ ను ఐఏఎస్ అధికారి కె.గోపాలకృష్ణన్ క్రియేట్ చేశాడని ప్రభుత్వం భావిస్తోందని ఆయన సస్పెన్షన్ కు ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో కేరళ ప్రభుత్వం పేర్కొంది. ఈ అధికారి చర్య అఖిల భారత సర్వీసుల క్యాడర్ లో మతపరమైన విబేధాలు, విద్వేషాలను సృష్టిస్తున్నట్లు ప్రాథమికంగా తేలిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అది సైబర్ క్రిమినల్స్ పని

అయితే, వాట్సప్ (whatsapp) లో ఆ మల్లు హిందూ ఆఫీసర్స్ గ్రూప్ ను తాను క్రియేట్ చేయలేదని ఐఏఎస్ అధికారి కె.గోపాలకృష్ణన్ వాదించారు. గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు తన మొబైల్ ఫోన్ ను హ్యాక్ చేశారని, తన అనుమతి లేకుండా మతపరమైన వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారని ఆ ఐఏఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లు హిందూ ఆఫీసర్స్, మల్లు ముస్లిం ఆఫీసర్స్ అనే రెండు వాట్సాప్ గ్రూపులకు హ్యాకర్లు తనను అడ్మిన్ గా చేశారని ఆయన పేర్కొన్నారు.

ఇతర ఐఏఎస్ అధికారులు కూడా..

అక్టోబర్ 30న మల్లు హిందూ ఆఫీసర్స్ వాట్సప్ గ్రూప్ (Mallu Hindu Officers) ను ఏర్పాటు చేశారని, ఆ ఛానెల్ లో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను చేర్చుకున్నారని పోలీసులు ఆరోపించారు. ఇలా గ్రూప్ ను ఏర్పాటు చేయడం సరికాదని ఇతర అధికారులు ఎత్తిచూపడంతో ఆయన ఆ వాట్సప్ గ్రూపును డిలీట్ చేశారు. దీనిపై కేరళ (kerala) ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఐఏఎస్ అధికారి కె.గోపాలకృష్ణన్ ఫోన్ హ్యాకింగ్ కు గురైనట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం పరికరాన్ని సమర్పించడానికి ముందు గోపాలకృష్ణన్ తన మొబైల్ ఫోన్ ను పలుమార్లు ఫ్యాక్టరీ రీసెట్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్ నివేదిక ఆధారంగా ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయం తీసుకున్నారు. గోపాలకృష్ణన్ కేరళలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ గా పనిచేశారు.

Whats_app_banner