Indian Railways : ఒక్క రైలు టికెట్​పై ఎన్నో ఫ్రీ బెనిఫిట్స్​- ఇవి చాలా తక్కువ మందికే తెలుసు!-indian railways free train ticket perks like food bedding medical aid and more ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Railways : ఒక్క రైలు టికెట్​పై ఎన్నో ఫ్రీ బెనిఫిట్స్​- ఇవి చాలా తక్కువ మందికే తెలుసు!

Indian Railways : ఒక్క రైలు టికెట్​పై ఎన్నో ఫ్రీ బెనిఫిట్స్​- ఇవి చాలా తక్కువ మందికే తెలుసు!

Sharath Chitturi HT Telugu
Nov 19, 2024 10:31 AM IST

Train ticket free benefits : మీరు రైలు టికెట్​ కొంటే మీకు కొన్ని ఫ్రీ బెనిఫిట్స్​ లభిస్తాయని మీకు తెలుసా? ఆ వివరాలను ఇక్కడ చూసేయండి, నెక్ట్స్​ టైమ్​ సద్వినియోగం చేసుకోండి..

మీ రైలు టికెట్​తో వచ్చే ఉచిత బెనిఫిట్స్​ గురించి మీకు తెలుసా?
మీ రైలు టికెట్​తో వచ్చే ఉచిత బెనిఫిట్స్​ గురించి మీకు తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది ఇండియన్​ రైల్వే. నిత్యం కోట్లల్లో మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగించుకుంటూ ఉంటారు. ఇక పండగలు, సెలవుల వేళ రద్దీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే, మనం కొనే రైలు టికెట్​ మీద ప్రయాణం మాత్రమే కాదు, ఇంకొన్ని వెసులుబాట్లు ఉచితంగా లభిస్తాయి. వీటి గురించి ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. ఒక్క ట్రైన్​ టికెట్​తో మనకి ఉచితంగా లభించే కొన్ని బెనిఫిట్స్​ గురించి ఇక్కడ తెలుసుకుందాము..

రైలు టికెట్​తో ఈ బెనిఫిట్స్​ ఉచితం.. మీకు తెలుసా?

రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్​ప్రెస్​ వంటి ప్రీమియం రైళ్లల్లో ప్రయాణించే వారు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి. మీ రైలు 2 గంటలు ఆలస్యమైతే, మీరు కొన్ని టికెట్​పై మీకు ఉచితంగా భోజనం లభిస్తుంది. ఈ-కాటరింగ్​ ద్వారా కూడా మీరు ఫ్రీ మీల్స్​ పొందొచ్చు.

లాంగ్​- డిస్టెన్స్​ ప్రయాణాలకు ఏసీ కోచ్​లలో బెడ్​షీట్స్​, దిండ్లు, దుప్పట్లు వంటివి మీకు ఉచితంగా లభిస్తాయి. కొన్ని రైళ్లల్లోని స్లీపర్​ క్లాస్​కి కూడా ఈ వెసులుబాటు ఉంటుంది.

రైలు ప్రయాణంలో మీకు ఆరోగ్య సమస్యలు వస్తే, రైల్వే మీకు ఉచితంగా ఫస్ట్​ ఎయిడ్​ చేస్తుంది. తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తే, తదుపరి స్టేషన్​లో మీకు వైద్య సహాయం అందించేలా చేస్తుంది.

రైళ్ల కోసం వెయిట్​ చేస్తుంటే.. మీరు వెయిటింగ్​ రూమ్స్​ని ఉపయోగించుకోవచ్చు. మీ ట్రైన్​ టికెట్​ చూపించి, ఏసీ- నాన్​ ఏసీ వెయింట్​ హాల్స్​లో ఉండొచ్చు.

దేశంలోని దాదాపు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్స్​లో లగేజ్​ రూమ్స్​ (క్లాక్​రూమ్స్​) ఉంటాయి. ఒక నెల పాటు మీరు వాటిల్లో మీ లగేజ్​ని స్టోర్​ చేసుకోవచ్చు. ఇందుకోసం కొంత ఫీజు కట్టాల్సి ఉంటుంది.

పలు ఐఆర్​సీటీసీ యాప్స్​లో మీరు టికెట్​ కొనుగోలు చేస్తే, మీకు ట్రావెల్​ ఇన్సూరెన్స్​ కూడా లభిస్తుంది. దీని ధర రూ. 5 కన్నా తక్కువగానే ఉంటుంది!

నెక్ట్స్​ టైమ్​ మీరు రైలులో ప్రయాణించేటప్పుడు పైన చెప్పిన వాటిని ఉపయోగించుకోండి.

ఇవి కూడా..!

విద్యార్థులు, ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు, కొన్ని వర్గాల వికలాంగులకు భారతీయ రైల్వే టికెట్​లపై డిస్కౌంట్స్​ని కూడా అందిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం