Ketu stotram: అనారోగ్య బాధలు, చెడు ప్రభావాల నుంచి బయటపడేసే కేతు స్తోత్రం- ఇలా పఠించండి
Ketu stotram: నవగ్రహాలలో నీడ గ్రహంగా కేతువును పిలుస్తారు. జాతకంలో కేతువు స్థానం ప్రతికూలంగా ఉంటే అనేక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయట పడేందుకు ఈ కేతు స్తోత్రం పఠించడం ముఖ్యం. దీన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువును నీడ గ్రహంగా పిలుస్తారు. ఇది వ్యక్తుల జీవితం మీద బాగా ప్రభావితం చూపిస్తుంది. నవగ్రహాలలో రాహు, కేతువులు మాత్రమే ఎల్లప్పుడూ తిరోగమన దశలో సంచరిస్తాయి. కేతు అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖసంతోషాలకు కొదువ ఉండదు.
జాతకంలో కేతు దోషాలు ఉంటే అనుకోని సమస్యలు, వైవాహిక జీవితంలో ఆటంకాలు, పెళ్లి నిశ్చయం కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి నుంచి బయట పడేందుకు కేతు స్తోత్రం పఠించడం చాలా మంచిది. స్కంద పురాణంలో కేతు స్తోత్రం గురించి వివరించారు. ఒక వ్యక్తి జాతక చక్రంలో కేతువు చెడు ప్రభావాలు ఎక్కువగా ఉంటే వాటిని నియంత్రించేందుకు ఈ స్తోత్రం పఠించాలి. ఇలా చేయడం వల్ల సవాలు లాంటి పరిస్థితి కూడా సానుకూలంగా మారుతుంది.
కేతు స్తోత్రం
కేతుః కాలః ధూమ్రకేతుర్వివర్ణకః ధర్మం ।
లోకకేతుర్మహాకేతుః సర్వకేతుర్భయప్రదః ।।1।।
రుద్ర రుద్రప్రియో రుద్రః క్రూరకర్మ సుగన్ధ్రక్ ।
ఫలస ధూమసంకశ చిత్రయజ్ఞయోపవితధృక్
తారాగణవిమర్దో జైమినేయో గ్రహాధిపః ।
పంచవింశతి నామాని కేతుర్యః సతతం పఠేత్ ।।3।।
తస్య నశ్యన్తి బాధశ్చాసర్వాహా కేతుప్రసాదతః.
ధనధాన్యపశూనాం చ భవేద్ వ్రద్విర్ణసంశయః ।।4।।
కేతు స్తోత్రం పఠించడం వల్ల లాభాలు
నిత్యం కేతు స్తోత్రాన్ని పఠించడం వల్ల కేతు ప్రతికూల ప్రభావాలు నియంత్రణలోకి వస్తాయి. ఈ చిన్న స్తోత్రం ఆరోగ్య సమస్యలు, ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించడంలో గొప్పగా సహాయపడుతుంది. ప్రతి రోజు దీన్ని జపించడం వల్ల చెడు, దుష్ట భయాల నుంచి బయటపడతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిన ధైర్యంగా ఉండగలుగుతారు. వాటిని ఎదుర్కొనేందుకు మీకు ఇది సహాయపడుతుంది.
కేతువు సానుకూల శక్తులు, ఆశీర్వాదాల వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం మెరుగుపడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో అశ్విని, మాఘ లేదా మూలా నక్షత్రాలకు అధిపతి కేతువు. అందువల్ల ఈ నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు కేతువు స్తోత్రం పఠించడం వల్ల అధిక ప్రయోజనాలు పొందుతారు. కేతువును శాంతింపజేయడం కోసం దీన్ని పఠించవచ్చు. ఇది చెడు ప్రభావాలను తొలగిస్తుంది.
ఎలా పఠించాలి?
మీరు పూజ చేసుకున్న తర్వాత లేదంటే ఉదయాన్నే ఈ కేతు స్తోత్రం పఠించవచ్చు. మీకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు సౌకర్యవంతంగా ఉండే స్థలం ఎంచుకుని కూర్చోవాలి. ధ్యాన భంగిమలో కూర్చుని కేతు స్తోత్రాన్ని పూర్తి భక్తితో, శ్రద్దతో పఠించాలి. ప్రతి పదాన్ని సరిగా ఉచ్చరించాలి. మనసు, మెదడు ఏకాగ్రతతో దీన్ని పఠించాలి. ఈ స్తోత్రం పఠించేటప్పుడు కళ్ళు మూసుకుని దైవంతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాలి. కేతు ప్రతికూల ప్రభావాలతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు కేతు స్తోత్రం పఠించవచ్చు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్