Crime news : రైళ్లల్లో వాటర్​ బాటిల్​ అమ్మేందుకు గొడవ.. ఇద్దరు దారుణ హత్య!-three held for two murders connected to water vending business in trains ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : రైళ్లల్లో వాటర్​ బాటిల్​ అమ్మేందుకు గొడవ.. ఇద్దరు దారుణ హత్య!

Crime news : రైళ్లల్లో వాటర్​ బాటిల్​ అమ్మేందుకు గొడవ.. ఇద్దరు దారుణ హత్య!

Sharath Chitturi HT Telugu
Feb 19, 2024 11:13 AM IST

Maharashtra crime news : రైళ్లల్లో వాటర్​ బాటిల్స్​ అమ్మే విషయంపై గొడవ జరగడంతో ఇద్దరు ప్రాణాలు పోయాయి! ముగ్గురు కలిసి.. ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

రైళ్లల్లో వాటర్​ బాటిల్​ అమ్మేందుకు గొడవ.. ఇద్దరు దారుణ హత్య!
రైళ్లల్లో వాటర్​ బాటిల్​ అమ్మేందుకు గొడవ.. ఇద్దరు దారుణ హత్య!

Crime news : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రైళ్లల్లో వాటర్​ బాటిల్స్​ అమ్మే వ్యాపారం నేపథ్యంలో గొడవ జరగ్గా.. ముగ్గురు వ్యక్తులు, మరో ఇద్దరిని దారుణంగా హతమార్చారు.

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర థానే ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. బాధితులు, నిందితులు.. రైళ్లల్లో మంచి నీటి సీసాలు అమ్ముకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. కాగా.. ఆ వ్యాపారం విషయంలో ఆ ఐదుగురి మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా విభేదాలు కొనసాగుతూ వచ్చాయి.

కాగా.. ఫిబ్రవరి 3న.. ఓ వ్యక్తి మృతదేహాన్ని వైతరణి నదిలో గుర్తించారు పోలీసులు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో.. ఫిబ్రవరి 6న కసర ఘాట్​లో పోలీసులకు మరో మృతదేహం కనిపించింది. ఈ రెండు మృతదేహాలకు లింక్​ ఉందని తెలుసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

Maharashtra crime news : మరణించిన వారిలో ఒకరి చేతిపై టాటూలు ఉన్నాయి. వాటి ఆధారంగా.. మృతుడు.. 25ఏళ్ల దీపక్​ థోకే అని పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టగా.. రైళ్లల్లో వాటర్​ బాటిల్స్​ అమ్ముకునే మరికొందరితో అతనికి విభేదాలు ఉన్నాయని తెలిసింది. చివరికి.. నిందితులు 38ఏళ్ల పెంట్యా చిటారి, 22ఏళ్ల సైకుమార్​ కదామచి, 29ఏళ్ల కిషోర్​ శెత్యలను పోలీసులు అరెస్ట్​ చేశారు.

"వైతరణి నదిలో కనిపించిన వ్యక్తిని ఓ నిందితుడి ఇంట్లో చంపేశారు. అనంతరం మృతదేహాన్ని నదిలో పడేశారు. కసర ఘట్​ దగ్గర రింకు గుప్త మృతదేహం కనిపించింది. వాళ్లందరు.. ఉల్హాస్​నగర్​ ప్రాంతంలో రైళ్లల్లో వాటర్​ బాటిల్స్​ అమ్ముకుంటూ ఉండేవారు. ఉల్హాస్​నగర్​లో ఫిబ్రవిర 2న ఓ మిస్సింగ్​ కేసు కూడా నమోదైంది. చివరికి.. బాధితులను చంపేసిన తర్వాత.. ముగ్గురు నిందితులు హైదరాబాద్​కు పారిపోయారు. మేము వేగంగా దర్యాప్తు చేపట్టి.. నిందితులను అరెస్ట్​ చేశాము," అని పోలీసులు వెల్లడించారు.

అయితే.. ఈ హత్య కేసులో నాలుగో నిందితుడు కూడా ఉన్నాడని, అతని పేరు సాగర్​ తెలంగ్​ అని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్టు, త్వరలోనే అతడిని పట్టుకుంటామని స్పష్టం చేశారు.

యూట్యూబ్ వీడియోలు చూసి..

బిహార్​లో దారుణం చోటు చేసుకుంది. యూట్యూబ్ సహా సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎలా పడుతుందో కళ్లకు కట్టే క్రైమ్ స్టోరీ ఇది. కేవలం 8, 9, 11 తరగతులు చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. ఒక యూట్యూబ్ వీడియో చూసి, తాము కూడా అలాగే చేయాలని నిర్ణయించుకుని, ఒక క్యాబ్ డ్రైవర్​ను హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం