Urine in fruit juice : ‘జూస్​లో మూత్రం పోసి అమ్ముతున్నారు’.. ఇద్దరిపై దాడి- వీడియో వైరల్​!-ghaziabad men allegedly serve fruit juices mixed with urine locals thrash them ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Urine In Fruit Juice : ‘జూస్​లో మూత్రం పోసి అమ్ముతున్నారు’.. ఇద్దరిపై దాడి- వీడియో వైరల్​!

Urine in fruit juice : ‘జూస్​లో మూత్రం పోసి అమ్ముతున్నారు’.. ఇద్దరిపై దాడి- వీడియో వైరల్​!

Sharath Chitturi HT Telugu
Sep 14, 2024 01:40 PM IST

Urine mixed in fruit juice : ఘజియాబాద్​లో ఒక షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దుకాణంలో పనిచేస్తున్న కొందరు ఫ్రూట్​ జూస్​లో మూత్రం పోసి ఇస్తున్నారని, వారిని స్థానికులు చితకబాదారు. ఈ దుకాణంలో 1 లీటర్​ మూత్రం కూడా దొరికిదట!

ఫ్రూట్​ జూస్​లో మూత్రం పోశారని దాడి..
ఫ్రూట్​ జూస్​లో మూత్రం పోశారని దాడి.. (Screengrab)

ఉత్తర్​ ప్రదేశ్​ ఘజియాబాద్​లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఫ్రూట్​ జూస్​లో మూత్రం పోసి విక్రయిస్తున్నారంటూ.. సంబంధిత దుకాణంలోని ఇద్దరిపై స్థానికులు దాడి చేశారు. ఆ ఇద్దరిని చితకబాదారు. ఈ వార్త పలువురిని విస్మయానికి గురిచేయడమే కాకుండా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

ఇదీ జరిగింది..

"ఘజియాబాద్​లో మూత్రాన్ని జ్యూస్​లో కలిపి వినియోగదారులకు ఇస్తున్నారు. షాపులో పనిచేసే కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. దుకాణం నుంచి ఒక లీటర్ మూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ ప్రజలు చితకబాదారు,' అని ఎక్స్ పేజీలో ఒకరు వీడియోను పోస్ట్ చేశారు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోలో దిల్లీ-ఎన్​సీఆర్ అంతటా కనిపించే ఒక సాధారణ పండ్ల రసం దుకాణం ఉంది. కొందరు స్థానికులు మనుషులను కొడుతున్న దృశ్యాలు కూడా అందులో కనిపించాయి. కార్మికుడిని కొడుతున్న వ్యక్తిని ఓ స్థానికుడు ఆపి, బయటకు తీసుకొస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోని ఇక్కడ చూడండి:

ఫ్రూట్ జ్యూస్ షాప్ లోపల మూత్రం ఉన్న ప్లాస్టిక్ కంటైనర్ కనిపించిందని స్థానిక కథనాలను ఉటంకిస్తూ ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రచురించింది. షాపులో ఉన్నవారు తమ శరీర వ్యర్థాలను జ్యూస్​లలో కలిపినట్లు అంగీకరించారని స్థానికులు పేర్కొన్నారు. వారు క్షమాపణలు కూడా చెప్పారని తెలుస్తోంది.

ఈ గొడవ నేపథ్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

వాస్తవానికి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి గతేడాది అందరిని షాక్​కు గురిచేసింది.

ఆన్​లైన్​లో ఆర్డర్ చేసి మిల్క్ షేక్ తాగిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. "నేను డెలివరీ తీసుకుని నా కప్పులో ఒక స్ట్రా ఉంచి సిప్ తీసుకున్నాను. గ్రుభూబ్ (ఆన్​లైన్​ ఫుడ్​ సర్వీస్​) డ్రైవర్ నుంచి నాకు డెలివరీ చేసిన కప్పులో వెచ్చని మూత్రం ఉందని నాకు తెలిసింది," అని ఆ వ్యక్తి ఒక వార్తా సంస్థతో చెప్పాడు.

రిపోర్టుల ప్రకారం, డెలివరీ డ్రైవర్ ఆ వ్యక్తి ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళుతుండగా ఓ కప్పులో మూత్రం పోశాడు. అయితే ఆర్డర్ ఇచ్చే సమయంలో ఆ వ్యక్తికి మిల్క్ షేక్​కు బదులు మూత్రంతో నిండిన కప్పు ఇచ్చాడు.

Whats_app_banner

సంబంధిత కథనం